ఇప్పటికే టౌటేతో అల్లకల్లోలం... ముంచుకొస్తున్న ‘‘యాస్‘‘ తుఫాన్

By Siva KodatiFirst Published May 19, 2021, 4:55 PM IST
Highlights

పశ్చిమ తీరంలో విధ్వంసం సృష్టించిన తౌటే తుఫాను తీరం దాటిందని ఊపిరి పీల్చుకునేలోపు మరో తుఫాను గండం ముంచుకొస్తోంది. ఈసారి భారత తూర్పుతీరం వణకనుంది. ఈ నెల 25న బంగాళాఖాతంలో తుఫాను ఏర్పడుతుందని వాతావరణ శాఖ చెబుతోంది

పశ్చిమ తీరంలో విధ్వంసం సృష్టించిన తౌటే తుఫాను తీరం దాటిందని ఊపిరి పీల్చుకునేలోపు మరో తుఫాను గండం ముంచుకొస్తోంది. ఈసారి భారత తూర్పుతీరం వణకనుంది. ఈ నెల 25న బంగాళాఖాతంలో తుఫాను ఏర్పడుతుందని వాతావరణ శాఖ చెబుతోంది. దీనికి ‘‘యాస్’’ అని పేరు పెట్టారు.

ఇది వాయువ్య దిశగా కదులుతూ పశ్చిమబెంగాల్, ఒడిశా వైపు దూసుకు వస్తుందని భారత వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ నెల 26న పశ్చిమ బెంగాల్, ఒడిశా మధ్య తీరం దాటుతుందని అంచనా వేసింది. 

కాగా, భూమధ్యరేఖ వద్ద హిందూ మహా సముద్రంలో ఆగ్నేయ బంగాళాఖాతాన్ని ఆనుకుని తుపాను ఆవర్తనం ఏర్పడింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఈనెల 23 నాటికి అల్పపీడనం ఏర్పడగలదని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తెలుగు రాష్ట్రాలలో నేడు ఉరుములు, మెరుపులతో చెదురుమదురు వర్షాలు కురుస్తాయి. రేపు తెలంగాణలో ఉరుములతో కూడిన జల్లులు కొనసాగుతాయి.

Also Read:టౌటే తుఫాన్ ధాటికి కొట్టుకుపోయిన నౌక: 22 మృతదేహాల వెలికితీత

ఈనెల 23 న దక్షిణ కోస్తాంధ్ర తీరంలో సముద్రం అల్లకల్లోలం అవుతుంది. చెదురుమదురు వర్షాలు పడతాయని వాతావారణ శాఖ తెలిపింది. కాగా, ఇప్పటికే టౌటే తుఫాన్  ప్రభావంతో దేశంలో ఆరు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు, పెనుగాలుల ధాటికి ఆయా రాష్ట్రాల్లో 14 మంది మరణించారు. సోమవారం  రాత్రి పొద్దుపోయిన తర్వాత  గుజారత్ తీరాన్ని తుఫాన్ తాకింది. 

ముంబై తీర ప్రాంతంలోని అరేబియా సముద్రంలో రెండు నౌకలు తుపాన్ కారణంగా లంగర్లు కొట్టుకొని సముద్రంలో కొట్టుకుపోయాయి. ఈ రెండు నౌకల్లోని 400 మంది సిబ్బందిని నేవీ అధికారుల రక్షించారు.  తుఫాన్ కారణంగా ముంబై అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కొన్ని గంటల పాటు మూసివేశారు.
 

click me!