కరోనా నుంచి కోలుకున్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్..

By AN TeluguFirst Published Apr 29, 2021, 3:34 PM IST
Highlights

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కరోనా నుంచి బయటపడ్డారు. ఇప్పటివరకు చికిత్స పొందుతున్న ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కాగా ఏప్రిల్ 19న కరోనా బారినపడిన మన్మోహన్ సింగ్ పదిరోజుల చికిత్స అనంతరం నెగెటివ్ గా తేలింది. ఢిల్లీలోని ఎయిమ్స్ కు తరలించారు. 

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కరోనా నుంచి బయటపడ్డారు. ఇప్పటివరకు చికిత్స పొందుతున్న ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కాగా ఏప్రిల్ 19న కరోనా బారినపడిన మన్మోహన్ సింగ్ పదిరోజుల చికిత్స అనంతరం నెగెటివ్ గా తేలింది. ఢిల్లీలోని ఎయిమ్స్ కు తరలించారు. 

మన్మోహన్ సింగ్ త్వరగా కోలుకోవాలంటూ పార్టీల కతీతంగా వివిధ పార్టీల కీలకనేతలు సందేశాలు పంపారు. కరోనా పాజిటివ్ గా తేలడానికి రెండు రోజుల క్రితం కరోనాపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో కీలక సూచనలు చేశారు. 

 కరోనా విషయమై  తీసుకోవాల్సిన చర్యలపై  మన్మోహన్ సింగ్ ప్రధాని మోడీకి లేఖ రాశాడు.  దేశంలో కరోనా వ్యాక్సినేషన్ తో పాటు  కరోనా వవైరస్ వ్యాప్తిని తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఆయన ప్రభుత్వానికి ఆ లేఖలో పలు సూచనచేశారు.  

ఈ లేఖకు  కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి  హర్షవర్ధన్ కూడ స్పందించారు. మన్మోహన్ సింగ్  రాసిన లేఖకు ఆయన సమాధానం ఇచ్చారు. ప్రధానికి రాసిన లేఖలో ఐదు అంశాలను ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. రెండు పేజీల రెండు పేజీల లేఖలో ఆయన ఈ ఐదు అంశాలపై సంపూర్ణంగా వివరించారు.

దేశంలో  కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. నాలుగైదు రోజులుగా  కరోనా కేసులు దేశంలో  రెండు లక్షలు దాటుతున్నాయి.  కరోనా రోగుల రికవరీ రేటు తగ్గిపోవడం ఆందోళన కల్గిస్తోంది.  దీంతో వ్యాక్సినేషన్ ప్రక్రియను  వేగవంతం చేయడంతో పాటు ప్రజలంతాఅప్రమత్తంగా ఉండేలా చూడాలని కేంద్రం ఆయా రాష్ట్రాలకు సూచించింది.  సెకండ్ వేవ్  లో వైరస్  ఉధృతి ఎక్కువగా ఉందని  నిపుణులు చెబుతున్నారు. 

కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పకుండా ధరించాలని, శానిటైజ్ చేసుకోవాలని, సామాజిక దూరం పాటించాలని ఏషియానెట్ విజ్ఢప్తి చేస్తోంది. సాధ్యమైనంత త్వరగా కరోనా టీకా తీసుకోవాలని కూడా కోరుతోంది. అందరం కలిసి కరోనా వ్యాప్తిని అరికడుదాం, మనల్ని మనం రక్షించుకుందాం.  #ANCares #IndiaFightsCorona
 

click me!