అద్భుతం : ఎనిమిది రోజుల చిన్నారి.. కరోనాను జయించాడు.. !!

By AN TeluguFirst Published Apr 29, 2021, 1:28 PM IST
Highlights

కరోనా కనికరం చూపించడం లేదు. వయసుతో తేడా లేకుండా అందర్నీ కాటేస్తోంది. పద్నాలుగేళ్ల చిన్నారుల్ని, నవయవ్వనంలో ఉన్న యువతను, వృద్ధుల్ని ఇలా అందర్నీ తనతో తీసుకువెడుతోంది.

కరోనా కనికరం చూపించడం లేదు. వయసుతో తేడా లేకుండా అందర్నీ కాటేస్తోంది. పద్నాలుగేళ్ల చిన్నారుల్ని, నవయవ్వనంలో ఉన్న యువతను, వృద్ధుల్ని ఇలా అందర్నీ తనతో తీసుకువెడుతోంది.

ఆ కర్కశత్వానికి ఓ ఎనిమిది రోజుల చిన్నారి తన బోసి నవ్వులతో చెక్ పెట్టింది. తనను కాటేసిన కరోనాను ఎడమకాలితో తన్ని తరిమింది. అద్భుతమైన ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. 

ఉత్తరప్రదేశ్, ఘజియాబాద్ లోని యశోద ఆస్పత్రిలో ఈ అద్భుత జరిగింది. ఈ ఆస్పత్రిలో ఎనిమిది నెలల చిన్నారిని శ్వాససమస్యలతో జాయిన్ చేశారు. ఆ బాధిత శిశువుకు వైద్యులు వెంటనే చికిత్స మొదలుపెట్టారు. ఫలితంగా ఆ శిశువు అనారోగ్యం నుంచి కోలుకున్నాడు. 

ఆ తరువాత చేసిన వైద్య పరీక్షల్లో శిశువుకు కరోనా సోకినట్లు తేలింది. వెంటనే ఆ చికిత్స మొదలు పెట్టారు. దీంతో బాలుడు ఇప్పుడు కరోనాను జయించాడు. ఆ చిన్నారికి నెగెటివ్ రిపోర్ట్ రావడంతో తల్లిండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పకుండా ధరించాలని, శానిటైజ్ చేసుకోవాలని, సామాజిక దూరం పాటించాలని ఏషియానెట్ విజ్ఢప్తి చేస్తోంది. సాధ్యమైనంత త్వరగా కరోనా టీకా తీసుకోవాలని కూడా కోరుతోంది. అందరం కలిసి కరోనా వ్యాప్తిని అరికడుదాం, మనల్ని మనం రక్షించుకుందాం.  #ANCares #IndiaFightsCorona

click me!