మహారాష్ట్ర మాజీ సీఎం ఆశోక్ చవాన్‌కి కరోనా: కొనసాగుతున్న చికిత్స

By narsimha lode  |  First Published May 25, 2020, 10:36 AM IST

మహారాష్ట్రలో  కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. మహారాష్ట్ర మాజీ సీఎం, ప్రస్తుత పీడబ్ల్యూడీ మంత్రి ఆశోక్ చవాన్ కు కరోనా సోకింది. ఎటువంటి లక్షనాలు లేకపోయినా కరోనా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన నాందేడ్ లో చికిత్స పొందుతున్నారు.



ముంబై:మహారాష్ట్రలో  కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. మహారాష్ట్ర మాజీ సీఎం, ప్రస్తుత పీడబ్ల్యూడీ మంత్రి ఆశోక్ చవాన్ కు కరోనా సోకింది. ఎటువంటి లక్షనాలు లేకపోయినా కరోనా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన నాందేడ్ లో చికిత్స పొందుతున్నారు.

రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జితేంద్ర అవాద్ కు  కూడ గతంలో కరోనా సోకిన విషయం తెలిసిందే. ముంబైలోని ఆసుపత్రిలో చికిత్స పొందిన తర్వాత ఆయన కోలుకొన్నారు. 

Latest Videos

కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్‌ నాయకునిగా ఉన్న అశోక్‌ చవాన్‌ 2008 డిసెంబర్‌ 8 నుంచి 2010 నవంబర్‌ 9 వరకు సీఎంగా కొనసాగారు. ఆదర్శ కుంభకోణం వ్యవహారంలో ఆయనపై ఆరోపణలు రావడంతో అధిష్టానం ఒత్తిడి మేరకు సీఎం పదవికి రాజీనామా చేశారు. ఉద్ధవ్ ఠాక్రే మంత్రివర్గంలో ఆయన మంత్రిగా కొనసాగుతున్నారు.  

also read:లాక్‌డౌన్ మే 31తో ముగుస్తుందని చెప్పలేం, రానున్న రోజుల్లో మరిన్ని జాగ్రత్తలు: సీఎం

ఆదివారం నాటికి మహారాష్ట్రలో కరోనా కేసులు 50,231కి చేరుకొన్నాయి. ఇందులో 33,988 యాక్టివ్ కేసులుగా ప్రభుత్వం ప్రకటించింది.రాష్ట్రంలో కరోనా సోకి చికిత్స పొందిన తర్వాత 14,600 మంది కోలుకొన్నట్టుగా మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఆదివారం నాటికి రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 1635కి చేరుకొంది.

మహారాష్ట్రలో కరోనా కేసుల ఉధృతి తగ్గడం లేదు. దీంతో మే 31వ తేదీతోనే లాక్ డౌన్ ముగిసిపోతోందని చెప్పలేమని సీఎం ఉద్దవ్ ఠాక్రే ఆదివారం నాడు వ్యాఖ్యానించారు. రానున్న రోజుల్లో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

 


 

click me!