కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామికి కరోనా.. !

By AN TeluguFirst Published Apr 17, 2021, 11:52 AM IST
Highlights

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్ డి కుమారస్వామి కరోనా బారిన పడ్డారు. ఈ మేరకు ఆయన శనివారం తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. కోవిడ్ పరీక్షల్లో తనకు పాజిటివ్ తేలిందని, గత కొద్ది రోజులుగా తనతో సన్నిహితంగా మెలిగినవారు, తనను కలిసిన వారు జాగ్రత్తగా ఉండాలని కోరారు.

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్ డి కుమారస్వామి కరోనా బారిన పడ్డారు. ఈ మేరకు ఆయన శనివారం తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. కోవిడ్ పరీక్షల్లో తనకు పాజిటివ్ తేలిందని, గత కొద్ది రోజులుగా తనతో సన్నిహితంగా మెలిగినవారు, తనను కలిసిన వారు జాగ్రత్తగా ఉండాలని కోరారు.

తాను ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్నానని, తనతో కలిసినవారు టెస్టులు చేయించుకుని,  స్వయంగా ఐసోలేషన్ లో ఉండాలని కోరారు. 

దేశంలోని దాదాపు 15 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కరోనా విలయతాండవం చేస్తోంది. దీంతో రాత్రిపూట కర్ఫ్యూలు అమల్లో ఉన్నాయి. ఓ వైపు వ్యాక్సినేషన్ వేగవంతంగా జరుగుతున్నా.. మరోవైపు కోవిడ్ విజృంభణ ఏ మాత్రం ఆగడం లేదు. 

ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ మరణాలు 3 మిలియన్లకు చేరుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 139.5 మిలియన్ల మంది కరోనా బారిన పడ్డారు. ప్రపంచవ్యాప్తంగా 869 మిలియన్లకు పైగా వ్యాక్సినేషన్ డ్రైవ్ లు నడుస్తున్నాయని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది.

ఈ విలయం నుంచి బయటపడడానికి యునైటెడ్ స్టేట్స్ 200 మిలియన్ డోసుల కోవిడ్ -19 వ్యాక్సిన్ లను అధికారులు అందించారు. దేశంలో వైరస్ ఇంకా ఉధృతంగా ఉన్నప్పటికీ, న్యూయార్క్ నగర మేయర్ బిల్ డి బ్లాసియో మే 3 న సిటీ వర్కర్స్ అందరూ ఆఫీసులకు రావాలని ఇచ్చిన పిలుపుకు కట్టబడి ఉన్నారు. 

కాగా  మహమ్మారి బారిన పడిన రెండవ దేశంగా భారతదేశం నిలిచింది. దేశంలోరోజువారీ సంక్రమణ సంఖ్య 2 లక్షలకు పైగానే ఉంది.  శుక్రవారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 2,33,869 కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులు నమోదైన కేసుల్లో ఇప్పటివరకు ఇదే అత్యధికం. 
 

click me!