రోడ్డు ప్రమాదంలో గుజరాత్‌ మాజీ మంత్రి మృతి...కారుతో బుల్ డోజర్ ను ఢీకొట్టి.. అక్కడికక్కడే...

Published : May 19, 2023, 04:03 PM IST
రోడ్డు ప్రమాదంలో గుజరాత్‌ మాజీ మంత్రి మృతి...కారుతో బుల్ డోజర్ ను ఢీకొట్టి.. అక్కడికక్కడే...

సారాంశం

గుజరాత్‌ మాజీ మంత్రి వల్లభ్‌భాయ్ వాఘాసియా రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. స్వయంగా కారు డ్రైవ్ చేసుకుంటూ వస్తున్న ఆయన బుల్ డోజర్ ను ఢీ కొట్టారు. 

గుజరాత్‌ : గుజరాత్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. మాజీ మంత్రి ఒకరు రోడ్డు ప్రమాదంలో హఠాన్మరణం పాలయ్యారు. గుజరాత్‌ మాజీ మంత్రి వల్లభ్‌భాయ్ వాఘాసియా రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. గుజరాత్‌ని అమ్రేలి జిల్లాలోని సావర్‌కుండ్ల పట్టణం సమీపంలో ఆయన నడుపుతున్న కారు బుల్‌డోజర్‌ను ఢీకొట్టింది.

దీంతో గుజరాత్‌ మాజీ వ్యవసాయ మంత్రి వల్లభ్‌భాయ్ వాఘాసియా మరణించినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. ఈ ప్రమాదం గురువారం రాత్రి జరిగినట్లు వాండా పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు.

సావర్కుండ్లా అసెంబ్లీ స్థానం గతంలో గెలిచిన బిజెపి మాజీ శాసనసభ్యుడు వఘాసియా, 69, విజయ్ రూపానీ ప్రభుత్వం మొదటి టర్మ్‌లో వ్యవసాయం, పట్టణ గృహనిర్మాణ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన ఒక గ్రామం నుండి సావర్కుండ్లకు తిరిగి వస్తుండగా వాండ గ్రామ సమీపంలోని రాష్ట్ర రహదారిపై రాత్రి 8.30 గంటల సమయంలో ప్రమాదం జరిగింది. అతనితో పాటు వాహనంలో ఉన్న మరొకరికి గాయాలయ్యాయని పోలీసు అధికారి తెలిపారు.

రోమ్ తగలబడిపోతుంటే.. ఫిడేల్ వాయించినట్టు: మణిపూర్ హింసను పేర్కొంటూ కేంద్రంపై కాంగ్రెస్ ఫైర్

మాజీ మంత్రి ప్రయాణిస్తున్న కారు బుల్‌డోజర్‌ను ఢీకొనడంతో గాయపడ్డారు. అతడిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఆసుపత్రి వద్ద పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, ఆయన మద్దతుదారులు గుమిగూడారు.

'సావరకుండ్ల మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వివి వఘాసియా రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. నైపుణ్యం కలిగిన ఆర్గనైజర్‌గా, మాస్ లీడర్‌గా పనిచేసి అమ్రేలి ప్రజలకు సేవ చేసిన నాయకుడు మన మధ్య లేరు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాం. ఆయన కుటుంబానికి నష్టాన్ని భరించే శక్తి కావాలి' అని సావర్‌కుండ్ల బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మహేశ్ కస్వాలా అన్నారు.

అమ్రేలి ఎమ్మెల్యే కౌశిక్ వెకారియ మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజల సంక్షేమం కోసం వాఘాసియా చేసిన కృషి మరువలేనిదని అన్నారు. వఘాసియా 2012 అసెంబ్లీ ఎన్నికల్లో సావర్కుండ్లా స్థానం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచి, 2016లో విజయ్ రూపానీ ప్రభుత్వంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

PREV
click me!

Recommended Stories

IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు
Nuclear Devices in Himalayas : నెహ్రూ, ఇందిరాలే ప్రస్తుత ప్రకృతి విపత్తులకు కారణమా..?