
న్యూఢిల్లీ: జ్ఞానవాపి కేసులో కార్బన్ డేటింగ్ సర్వే చేయాలన్న అలహాబాద్ హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది.తదుపరి విచారణ వరకు సుప్రీంకోర్టు స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశంపై తదుపరి విచారణ జరిగే వరకు జ్ఞానవాపి మసీదు ఆవరణలో ఉన్న శివలింగం యొక్క కార్బన్ డేటింగ్ నిర్వహించవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది.2022లో వీడియోగ్రాఫిక్ సర్వేలో వారణాసిలోని జ్ఞానవాపి మసీదు సముదాయంలో కనగొన్న శివలింగం పై కాన్బన్ డేటింగ్ కు అలహాబాద్ హైకోర్టు అనుమతిని ఇచ్చింది. ఈ విషయమై సుప్రీంకోర్టు ఇవాళ స్టే ఇచ్చింది.
సీజేఐ డీవై చంద్రచూడ్ , జస్టిస్ సరసింహహలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఇవాళ ఈ ఉత్తర్వులు జారీ చేసింది. అలహాబాద్ హైకోర్టు ఆదేశాలపై ముస్లిం పక్షం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
ఈ విషయమై ఇవాళ సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. యూపీ ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు విన్పించారు. కార్బన్ డేటింగ్ కు బదులుగా తాము మరికొన్ని శాస్త్రీయ పరీక్షలు చేయాలా వద్దా అని కూడా కనుగొనాల్సి ఉందన్నారు.ఈ విషయమై సీజేఐ చంద్రచూడ్ స్పందించారు. ఇలాంటి సున్నీతమైన విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు.