
రూ.750 కోట్లకు పైగా ఆర్థిక అవకతవకలకు పాల్పడిన కేసులో గుజరాత్ రాష్ట్ర మాజీ హోంమంత్రి, మెహసానా డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ప్రొడ్యూసర్స్ యూనియన్ లిమిటెడ్ (దూద్‌సాగర్ డెయిరీ) మాజీ చైర్మన్ విపుల్ చౌదరిని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అరెస్టు చేసింది. బుధవారం రాత్రి గాంధీనగర్‌లోని నివాసంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
తలలేని మృతదేహం కేసును ఛేదించిన పోలీసులు.. భార్యను హత్య చేసిన భర్త
విపుల్ చౌదరి తన మద్దతుదారులతో కలిసి రాబోయే ఎన్నికల్లో దూద్‌సాగర్ డెయిరీ కోసం ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. గుజరాత్ సహకార రంగంలో ఆయన ప్రముఖమైన వ్యక్తి. 1996లో శంకర్‌సింగ్ వాఘేలా ప్రభుత్వంలో హోం మంత్రిగా పనిచేశారు. ఆయన ఇప్పటికీ కూడా బీజేపీ నాయకుడిగా ఉన్నారు. ఈ అరెస్టు విషయంలో ACB జాయింట్ డైరెక్టర్ మకరంద్ చౌహాన్ మాట్లాడుతూ.. విపుల్ చౌదరి 2005 నుండి 2016 తన పదవీ కాలంలో రూ.750 కోట్లకు పైగా వివిధ కుంభకోణాలకు పాల్పడ్డాడరని అన్నారు.
కోళ్ల దొంగతనం బయటపడిందని.. వ్యక్తి ఆత్మహత్య..!!
“ఆయన తన హయాంలో పాల కూలర్లను కొనుగోలు చేశాడు, ఈ సమయంలో ఆయన ప్రభుత్వ మార్గదర్శకాలు, టెండర్ షరతులను ఉల్లంఘించాడు. ఎస్‌ఓపీని ఉల్లంఘిస్తూ రూ.485 కోట్లతో నిర్మాణ పనులు చేశారు. ఆయన డిప్యూటీ సెక్రటరీపై రివిజన్ పిటిషన్‌ను దాఖలు చేశాడు. దాని కోసం న్యాయవాది ఖర్చులను కూడా పాల ఉత్పత్తిదారుల సంఘం నుండి అరువుగా తీసుకున్నాడు ” అని జాయింట్ డైరెక్టర్ చెప్పారు.
“ ఇది కాకుండా స్కామ్ నుండి వసూలు చేసిన డబ్బులతో 31 కంపెనీలు ఏర్పాటు చేశారు. ఈ 31 కంపెనీలను తప్పుడు పత్రాల ఆధారంగా రిజిస్టర్ చేశారు. ఆయన భార్య, కొడుకు కూడా ఈ కంపెనీలో డైరెక్టర్లుగా ఉన్నారు’’ అని ఏసీబీ అధికారులు తెలిపారు. కాగా.. డెయిరీ, డబ్బును స్వాహా చేసినందుకు మేలో చౌదరి, ఆయన వ్యక్తిగత కార్యదర్శిపై ACB మెహసానా బ్రాంచ్‌లో ఫిర్యాదు నమోదు అయ్యింది. నేరపూరిత నమ్మక ద్రోహం, మోసం, ఫోర్జరీ కింద కేసు నమోదు చేసినట్లు ఏసీబీ ఒక ప్రకటనలో తెలిపింది.
ఉద్యోగం పేరుతో ట్రాప్.. స్పాలో మైనర్ పై నిత్యం 10-15 మంది అత్యాచారం
ఇదిలా ఉండగా.. మాజీ హోంమంత్రి అరెస్ట్ తో గుజరాత్ లో రాజకీయాలు వేడెక్కాయి. విపుల్ చౌదరి మద్దతు ఉన్న అర్బుద సేన అతడి అరెస్టును వ్యతిరేకిస్తోం ది. బీజేపీ ప్రభుత్వంలో ఆయన మంత్రిగా పని చేసినప్పుటికీ.. ఆయన గతంలో కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కూడా అంతే బలంగా ఉన్నారు.