ఉద్యోగం పేరుతో ట్రాప్.. స్పాలో మైన‌ర్ పై నిత్యం 10-15 మంది అత్యాచారం

Published : Sep 16, 2022, 12:09 PM IST
ఉద్యోగం పేరుతో ట్రాప్.. స్పాలో మైన‌ర్ పై నిత్యం 10-15 మంది అత్యాచారం

సారాంశం

Haryana: స్పాలో త‌న‌పై రోజూ 10-15 మంది వ్యక్తులు అత్యాచారం చేశారని ఒక 14 ఏళ్ల మైనర్ ఆరోపించింది.  ఉద్యోగం కోసం వెళ్తే ఇలా అక్క‌డి య‌జ‌మాని బెదిరింపులతో వీడియో తీశాడ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసింది. 

Gurugram: త‌న‌కు తెలిసిన ఒక మ‌హిళ‌ను డ‌బ్బు అవ‌స‌రం ఉంద‌నీ, త‌న‌కు ఉద్యోగం ఇప్పించాల‌ని ఒక యువ‌తి కోర‌గా.. మాయ‌మాట‌లు చెప్పి స‌ద‌రు యువ‌తిపై నిత్యం 10-15 మంది లైంగిక‌దాడికి పాల్ప‌డ్డారు. ఉద్యోగం మానేసి వెళ్ల‌డానికి యువ‌తి ప్ర‌య‌త్నం చేయ‌గా.. అత్యాచారానికి సంబంధించిన వీడియోను బ‌హిర్గ‌తం చేస్తామంటూ బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్నారు. ఈ దారుణ ఘ‌ట‌న హ‌ర్యానాలో చోటుచేసుకుంది. కేసు న‌మోదుచేసుకున్న పోలీసులు, ద‌ర్యాప్తు చేస్తున్నారు. 

వివ‌రాల్లోకెళ్తే..  గురుగ్రామ్ లో ఒక స్పాలో రిసెప్షనిస్ట్ ఉద్యోగంలో చేరిన 14 ఏళ్ల బాలికపై  అక్క‌డ పలువురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. తనకు తెలిసిన మహిళను ఇటీవల కలిశానని, తనకు డబ్బు అవసరం ఉందని, ఉద్యోగం ఇప్పించాలని వేడుకున్నట్లు బాలిక పోలీసులకు తెలిపింది. స‌మీప‌ బంధువు యాజమాన్యంలోని స్పాలో రిసెప్షనిస్ట్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పారు. స్పాలో రిసెప్ష‌నిస్టుగా చేరింది. అయితే, ఉద్యోగంలో చేరిన మొద‌టి రోజునే అమ్మాయి ఉండ‌టానికి ఒక గ‌ది ఇచ్చారు. అప్ప‌టికే అందులో ఇంకో వ్య‌క్తి ఉన్నారు. అయిన‌ప్ప‌టికీ.. ఆ అమ్మాయిని ఓ వ్య‌క్తి ఉన్న గ‌దిని ఉండ‌టానికి షేర్ చేసుకోవాల‌ని చెప్పార‌ని పేర్కొన్న బాధితురాలు.. ఆ గ‌దిలోనే త‌న‌పై అత్యాచారం జ‌రిగింద‌ని ఆరోపించింది. నిందితులు ఆ దారుణాన్ని వీడియో తీశారు. 

బాధితురాలు వారి లైగిక వేధింపులను తట్టుకోలేక ఉద్యోగం మానేయ‌డానికి సిద్ధ‌మైంది. అయితే, ఉద్యోగం వదిలేస్తానని చెప్పడంతో లైంగిక వేధింపులకు సంబంధించిన వీడియోతో ఆమెను నిందితులు బెదిరించారు.  "నాపై జ‌రిగిన అత్యాచారానికి సంబంధించిన వీడియోను ప్రసారం చేస్తామని వారు బెదిరించారు. నేను చాలా భయపడ్డాను.. తరువాతి 4-5 రోజులు స్పాకి వెళ్లాను. చాలా మంది నన్ను లైంగికంగా వేధించారు. నిత్యం ప‌ది నుంచి ప‌దిహేను మంది లైంగిక‌దాడికి పాల్ప‌డ్డారు" అని మైనర్  చెప్పింద‌ని పోలీసులు తెలిపారు. కొన్ని రోజుల తర్వాత ఆ అమ్మాయి ధైర్యం చేసి స్పాకి వెళ్లడం మానేసింది. కానీ నిందిత మహిళ, ఆమె సహచరులు ఆమెకు ఫోన్ చేస్తూ ఒక హోటల్‌కు తీసుకెళ్లారు, అక్కడ ఆమెను కొట్టినట్లు ఆరోపణలు వచ్చాయి.

ఈ క్ర‌మంలోనే బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. యువతులను ట్రాప్ చేసి వ్యభిచారంలోకి దింపేందుకు మహిళ, ఇతరులు ముఠాగా పనిచేశారని మైనర్ పోలీసులకు చెప్పారు. ఈ దారుణంపై పోలీసులు కేసు న‌మోదుచేశారు. IPC సెక్షన్లు 323 (స్వచ్ఛందంగా గాయపరచడం), 34 (సాధారణ ఉద్దేశ్యం), 376D (గ్యాంగ్ రేప్), 506 (నేరపూరిత బెదిరింపు), పోక్సో చట్టంలోని నిబంధనల ప్రకారం మహిళా పోలీసు స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయబడింద‌ని తెలిపారు. కాగా, లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులపై సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం బాధితురాలి గుర్తింపు ఆమె గోప్యతను కాపాడేందుకు బహిర్గతం చేయబడలేదు.

ఇదిలావుండగా, ఒక మానసిక విక‌లాంగ మైన‌ర్ బాలిక‌పై ఏడాదికి పైగా అత్యాచారం జ‌ర‌ప‌డంతో బాధితురాలు గ‌ర్భం దాల్చింది. ఈ ఘ‌ట‌న మ‌హారాష్ట్రలోని బారామ‌తిలో చోటుచేసుకుంది. పూణె జిల్లాలోని ఇందాపూర్ తాలూకా వాల్‌చంద్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండే ఓ 13 ఏళ్ల బాలిక‌పై ఓ వ్యక్తి పలుమార్లు లైంగికంగా దాడి చేశాడు. 6వ తరగతి చదువుతున్న బాధితురాలిపై నవంబర్ 2021 నుండి ఏప్రిల్ 2022 వరకు పలుమార్లు  అఘాయిత్యానికి పాల్ప‌డ్డాడు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు విచార

PREV
click me!

Recommended Stories

Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్