
రాజస్థాన్ రాష్ట్రంలో ఆర్ఎస్ఎంఎస్ఎస్బీ ఆధ్వర్యంలో నవంబర్ 12వ తేదీన (శదివారం) నిర్వహించిన ఫారెస్ట్ గార్డ్ రిక్రూట్‌మెంట్ -2022 పరీక్ష పేపర్ లీక్ అయింది. దీంతో ఆ పరీక్షను రద్దు చేశారు. ఈ పరీక్షను ఈ ఏడాది డిసెంబర్ నెలలో లేదా 2023 జనవరి నెలలో నిర్వహిస్తామని అధికారులు ప్రకటించారు. అయితే ఈ పరీక్ష పేపర్ లీక్ లో ప్రమేయం ఉన్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో ఒక ప్రభుత్వ ఉద్యోగి కూడా ఉన్నారు.
దారుణం.. సహజీవనం చేస్తున్న మహిళను హత్య చేసి.. 35 ముక్కలుగా కోసి, నగరమంతా చల్లి...
అటవీ శాఖలో 2300 ఫారెస్ట్ గార్డ్ పోస్టులను భర్తీ చేసేందుకు ఆర్ఎస్ఎంఎస్ఎస్బీ గతంలో నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ప్రకారం ఈ నెల 12వ తేదీన రెండు షిప్టుల్లో పరీక్షలు నిర్వహించారు. అందులో భాగంగా ఉదయం పూట ఓ పరీక్ష నిర్వహించగా.. మధ్యాహ్నం సమయంలో మరో పరీక్ష చేపట్టాల్సి ఉంది. అయితే రాజసమంద్ ప్రాంతంలో మధ్యాహ్నం జరగాల్సిన పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రం లీక్ అయినట్టు అధికారులకు సమాచారం అందింది. దీంతో ఆ పరీక్షను రాష్ట్ర వ్యాప్తంగా నిలిపివేశారు.
అసదుద్దీన్ ఒవైసీనికి నిరసన సెగ.. సభలో నల్లజెండాలు ప్రదర్శిస్తూ, మోదీ.. మోదీ.. అంటూ నినాదాలు..
వాస్తవానికి రాజ్‌సమంద్‌లోని రైల్‌మగర పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించే రెండో ప్రశ్నాపత్రం, దాని ఆన్సర్ షీట్స్ కు సంబంధించిన ఫొటోలు శనివారం సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయ్యాయి. అయితే ఈ కేసులో కరౌలీకి చెందిన దీపక్ శర్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాను దౌసాలోని లాల్సోట్ ప్రాంతంలోని అజయ్‌పురా గ్రామానికి చెందిన హేమ్‌రాజ్ మీనా నుంచి పేపర్ తీసుకున్నట్లు విచారణలో దీపక్ వెల్లడించారు. పరీక్ష రాసి తిరిగి వస్తున్న హేమ్‌రాజ్ మీనాను మొబైల్ లొకేషన్ ఆధారంగా గుర్తించిన పోలీసులు లాల్‌సోట్ రైల్వే స్టేషన్ సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తన తప్పును హేమరాజ్ అంగీకరించాడు.
ఇదిలా ఉండగా.. ఫారెస్ట్ గార్డ్ రిక్రూట్‌మెంట్ పరీక్షలో అరెస్టయిన కరౌలి నివాసి దీపక్ శర్మ ఒక ప్రభుత్వ ఉద్యోగి. ఉదయపూర్‌లోని అజ్మీర్ విద్యుత్ విత్రన్ నిగమ్‌లోని రైల్‌మాగ్రాలో టెక్నికల్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. హేమ్‌రాజ్ మీనా జైపూర్‌లో అద్దెకు ఉంటూ పోటీ పరీక్షకు సిద్ధమతున్నారు. అయితే జైపూర్, కరౌలి, ఉదయ్‌పూర్ తో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఇందులో ప్రమేయం ఉన్న మరి కొంత మంది యువకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. పోలీసులు మరో 12 మందికి ఈ పేపర్ లీకేజీలో హస్తం ఉందని భావిస్తున్నారు. ఈ పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా 215 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ పరీక్ష రాసేందుకు 1 లక్షా 59 వేల 954 మంది అభ్యర్థులు నమోదు చేసుకున్నారు. మొదటి పరీక్షకు 49.19 శాతం అభ్యర్థులు హాజరు కాగా, రెండో ఇన్నింగ్స్‌లో 51.62 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు.