దారుణం.. సహజీవనం చేస్తున్న మహిళను హత్య చేసి.. 35 ముక్కలుగా కోసి, నగరమంతా చల్లి...

Published : Nov 14, 2022, 12:26 PM ISTUpdated : Nov 14, 2022, 12:27 PM IST
దారుణం.. సహజీవనం చేస్తున్న మహిళను హత్య చేసి.. 35 ముక్కలుగా కోసి, నగరమంతా చల్లి...

సారాంశం

సహజీవనం చేస్తున్న మహిళతో గొడవ పడిన ఓ వ్యక్తి ఆమె గొంతుకోసి హత్య చేశాడు. ఆ తరువాత తాను దొరికిపోకుండా ఉండడానికి ఆమె శరీరాన్ని 35 ముక్కలుగా నరికి, ఢిల్లీలో వివిధ ప్రదేశాల్లో పడేశాడు. 

న్యూఢిల్లీ : ఢిల్లీలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన వెలుగు చూసింది. పెద్దల్ని ఎదురించి సహజీవనం చేస్తున్న ఓ జంట కేసులో విషాదం చోటు చేసుకుంది. సహజీవనం చేస్తున్న యువతి పెళ్లి చేసుకోమని ఒత్తిడి తేవడంతో.. విసిగిపోయిన ఆ వ్యక్తి.. తన సహచరిని గొంతుకోసి చంపాడు. ఆ తరువాత ఆమె శరీరాన్ని 35 ముక్కలుముక్కలుగా నరికి, ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో పడేశాడు. దీనికోసం 18 రోజులపాటు రోజూ అర్థరాత్రి 2 గంటలకు బైటికి వెళ్లేవాడు. విషయం బయటపడడంతో ఢిల్లీ పోలీసులు శనివారం ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. 

వివరాల్లోకి వెడితే.. అఫ్తాబ్ అమీన్ పూనావాలా, శ్రద్ధ ఇద్దరూ ముంబైలో పరిచయం. వీరిద్దరూ ముంబైలోని ఒక మల్టీ నేషనల్ కంపెనీలో పనిచేశారు. ఆ సమయంలో వీరిద్దరికీ ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారు. ఈ విషయం వీరి ఇళ్లలో తెలిసింది. దీంతో అమ్మాయి కుటుంబసభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎంత చెప్పినా వారు ఒప్పుకోలేదు. చివరికి చేసేదేమీ లేక వీరిద్దరూ ముంబైనుంచి ఢిల్లీకి పారిపోయి వచ్చారు. 

అసదుద్దీన్ ఒవైసీనికి నిరసన సెగ.. సభలో నల్లజెండాలు ప్రదర్శిస్తూ, మోదీ.. మోదీ.. అంటూ నినాదాలు..

ఢిల్లీలోని మెహ్రోలీ ప్రాంతంలో ఓ ప్లాట్ తీసుకుని లివింగ్ రిలేషన్ మొదలుపెట్టారు. కొద్దికాలం వారి సహజీవనం బాగానే జరిగింది. ఇక్కడికి వచ్చాక శ్రద్ధ తన కుటుంబసభ్యులతో రెగ్యులర్ గా ఫోన్ లో మాట్లాడుతుండేది. అయిదే కొద్ది రోజులుగా శ్రద్ధ ఫోన్ చేయకపోవడం, కుటుంబసభ్యులు చేసిన ఫోన్స్ కు ఆన్సర్ చేయకపోవడంతో వారికి అనుమానం వచ్చింది.

దీంతో, నవంబర్ 8న ఆమె తండ్రి వికాస్ మదన్ తన కుమార్తెను చూసేందుకు ఢిల్లీకి వచ్చారు. అయితే, అతను వచ్చే సమయానికి ఫ్లాట్‌కి  తాళం వేసి ఉంది. ఎంత సేపటికీ అఫ్తాబ్ అమీన్ పూనావాలా జాడ లేదు. దీంతో వికాస్ మదన్ మెహ్రౌలీ పోలీసులను ఆశ్రయించాడు. కూతురు కిడ్నాప్‌ అయ్యిందని ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు పూనావాలాను శనివారం అరెస్టు చేశారు. 

విచారణలో, షాకింగ్ విషయాలు వారిని రోమాలు నిక్కబొడుచుకునేలా చేశాయి. ఇటీవల శ్రద్ధ తనను వివాహం చేసుకోవాలని తరచూ కోరుతుండడంతో.. ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయని వెల్లడించాడు. ఈ గొడవలు రోజు రోజుకూ ముదిరిపోతుండడంతో కోపానికి వచ్చిన పూనావాలా.. తనను నమ్మి, తనతో జీవితం పంచుకోవడానికి అందర్నీ వదిలి వచ్చిందని కూడా.. ఆలోచించకుండా.. మే 18న అఫ్తాబ్ అమీన్ పూనావాలా తన లైవ్ ఇన్ పార్ట్‌నర్ శ్రద్ధను గొంతు కోసి హత్య చేశాడు. 

ఆ తర్వాత ఆమె శరీరాన్ని 35 ముక్కలుగా నరికాడు. వాటిని భద్రపరచడానికి ఫ్రిజ్ కొనుక్కున్నాడు. తరువాతి 18 రోజుల పాటు, ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో శరీర భాగాలను పారవేశాడు. దీనికోసం ప్రతీరోజు తెల్లవారుజామున 2 గంటలకు తన ఇంటి నుండి బయలుదేరేవాడు. ఈ విషయాలు వెలుగులోకి రావడంతో పోలీసులు ఆమె మృతదేహ భాగాలగురించి వెతుకుతున్నారు. పూనావాలాను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. 

PREV
click me!

Recommended Stories

Indian Army Romeo Force Destroys: గడ్డ కట్టే మంచులో మన ఇండియన్ ఆర్మీ| Asianet News Telugu
Tourists Enjoy New Year’s First Snow in Chamba: మంచు కొండల్లో న్యూఇయర్ వేడుకలు | Asianet News Telugu