బలవంతపు మత మార్పిడి ప్రమాదకరం - సుప్రీంకోర్టు

By team teluguFirst Published Nov 15, 2022, 10:04 AM IST
Highlights

బలవంతపు మత మార్పిడి తీవ్ర ప్రమాదకరమైన అంశమని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. దీనిని నిరోధించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పింది. 

మోసపూరిత, బలవంతపు మత మార్పిడులు తీవ్ర ప్రమాదకరమైనవని సుప్రీంకోర్టు అభివర్ణించింది. దీనిని నిరోధించడానికి అసవరమైన చర్యలు తీసుకోవాలని చెప్పింది. దీని కోసం నవంబర్ 22 లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. న్యాయమూర్తులు ఎంఆర్ షా, హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది.

భారత తొలి ప్రైవేట్ రాకెట్ ‘విక్రమ్-ఎస్’ వాయిదా.. ఎందుకంటే ?

“ప్రతి ఒక్కరికి మత స్వేచ్ఛ హక్కు ఉంది. కానీ బలవంతంగా మతం మార్చడం సరైంది కాదు. ఇది చాలా ప్రమాదకరమైన విషయం. ’’ అని ధర్మాసనం పేర్కొంది. ‘‘మత మార్పిడికి సంబంధించి ఆరోపించిన సమస్య నిజమని తేలితే అది తీవ్రమైన సమస్య. ఇది చివరికి దేశ భద్రతతో పాటు పౌరుల మత స్వేచ్ఛ, మనస్సాక్షిని ప్రభావితం చేస్తుంది. అందువల్ల కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో తమ వైఖరిని స్పష్టం చేయాలి. ఇలాంటి బలవంతపు మతమార్పిడులను అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవచ్చనే విషయంలో కౌంటర్ దాఖలు చేయడం మంచిది ’’ అని కోర్టు తెలిపింది.

రాజీవ్ గాంధీ హంతకుల్లో నలుగురిని శ్రీలంకకు పంపే ఏర్పాట్లు: తమిళనాడు అధికారులు

గిరిజన ప్రాంతాల్లో మత మార్పిడి ప్రబలంగా జరుగుతోందన్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనపై ధర్మాసనం స్పందిస్తూ.. “ మీరు ఇప్పుడే రంగంలోకి దిగాలి ” అని పేర్కొంది. ఈ విషయంలో ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ ప్రాతినిధ్యం వహించాలని కోర్టు పేర్కొంది. ఇది దేశ భద్రతకు కూడా తీవ్ర ముప్పు అని పేర్కొంది. ఎవరైనా స్వచ్ఛందంగా మతం మారితే అందులో ఎలాంటి ఇబ్బంది లేదని, మరో విధంగా మతం మారితే మాత్రం కేంద్ర ప్రభుత్వం దీనిపై తన వైఖరిని స్పష్టం చేయాల్సి ఉంటుందని చెప్పింది.

మిజోరంలో కుప్పకూలిన స్టోన్ క్వారీ.. 12 మంది మృతి చెందినట్లు అనుమానాలు..!

మోసం, బెదిరింపులు ద్వారా మత మార్పిడి ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమేనని ప్రకటించాలని కోరుతూ బీజేపీ నాయకుడు అశ్విని ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. అనేక మంది వ్యక్తులు, సంస్థలు గ్రామీణ ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీలను బలవంతంగా మతమార్పిడులకు గురి చేస్తున్నారని, పరిస్థితి ఆందోళనకరంగా ఉందని బీజేపీ నాయకుడు పిటిషన్ దాఖలు చేశారు.

అమానుషం.. గోడకు మేకు కొట్టి.. కుక్క మెడకు తాడు కట్టి.. కిరాతకంగా ఉరితీసిన దుండగులు...

“ రెండు దశబ్దాలుగా ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ కి చెందిన సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన ప్రజల సామూహిక బాగా పెరిగింది. అమాయకులను లక్ష్యంగా చేసుకొని మత సంస్థలు సాఫీగా తమ పని చేసుకుపోతున్నాయి.’’ అని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో తమిళనాడులో 17 ఏళ్ల లావణ్య ఆత్మహత్య నేపథ్యంలో ఈ పిటిషన్ దాఖలయ్యింది. మతమార్పిడి నియంత్రణకు కఠినమైన చర్యలు తీసుకోవాలని ఈ పిటిషన్ పేర్కొంది. 

click me!