పెంపుడు కుక్క కోసం.. రూ. 2.5 లక్షలతో ఫ్లైట్ బిజినెస్ క్యాబిన్ సీట్లన్నీ బుక్ చేశాడు

By telugu teamFirst Published Sep 19, 2021, 3:16 PM IST
Highlights

మనుషుల విశ్వాసాన్ని కుక్కుల ఏళ్ల తరబడి చూరగొంటున్నాయి. మనుషులూ వాటిపై తరచూ ప్రేమను చూపించే ఘటనలు ఎదురవుతూనే ఉన్నాయి. తాజాగా, ఓ వ్యక్తి తన పెంపుడు కుక్క కోసం విమానంలోని బిజినెస్ క్యాబిన్ సీట్లన్నింటిని రూ. 2.5 లక్షలు పెట్టి బుక్ చేసి వార్తల్లోకెక్కాడు.
 

న్యూఢిల్లీ: కుక్కలు మనుషులకు బెస్ట్ ఫ్రెండ్స్ అనే పాత సామెత తరుచూ నిజమని నిరూపితమవుతూనే ఉంటుంది. తాజాగా, ఓ వ్యక్తి దీన్ని మరోసారి నిరూపించారు. తన బెస్ట్ ఫ్రెండ్, పెట్ డాగ్ కోసం ఏకంగా విమానంలోని బిజినెస్ క్యాబిన్ సీట్లను బుక్ చేశాడు. ఇందుకోసం రూ.2.5 లక్షలను ఖర్చుపెట్టాడు. తన పెంపుడు కుక్కతో ఏకాంతంగా ప్రయాణించడానికి ఆయన ఈ సాహసం చేశాడు.

ముంబయి నుంచి చెన్నైకి తన పెంపుడు కుక్కతో ప్రయాణించాలనుకున్న ఓ వ్యక్తి పెట్ డాగ్‌పై తన ప్రేమను చాటుకున్నాడు. సుమారు రెండు గంటలపాటు సాగు జర్నీ కోసం బిజినెస్ క్యాబిన్‌లోని సీట్లన్నింటినీ ఆయన బుక్ చేశాడు. తద్వార వార్తల్లోకెక్కాడు.

ఎయిర్ ఇండియా విమానం ఏఐ-671 విమానంలో ఆయన సీట్లను బుక్ చేశాడు. బుధవారం ఉదయం 9 గంటలకు ముంబయి నుంచి ఆ విమానం బయల్దేరింది. దీంతో ఆ పెట్ డాగ్ మల్టీస్ డాగ్ ఆకాశపు అంచులను తన యజమానితో కలిసి తాకి వచ్చింది. ఏకాంతపు విలాసవంతమైన బిజినెస్ క్యాబిన్‌లో అద్భుత ప్రయాణాన్ని ఆ శునకం అనుభవించింది.

ముంబయి నుంచి చెన్నైకి రెండు గంటల ప్రయాణానికి బిజినెస్ క్లాస్ టికెట్ రూ. 18వేల నుంచి రూ. 20వేల వరకు ఉంటుంది. ఎయిర్‌బస్ ఏ320లో 12 బిజినెస్ క్లాస్ సీట్లుంటాయి. ప్రస్తుతం ఎయిర్ ఇండియా కొన్ని షరతులతో పెంపుడు జంతువులను తమ విమానాల్లో ప్రయాణించడానికి అనుమతిస్తున్నది.

click me!