
ముంబయి : ముంబయిలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ ఫుడ్ డెలివరీ బాయ్ తన పొరుగింటి వ్యక్తిని హత్య చేశాడు. ఆ తరువాత అతడి శవాన్ని దుప్పట్లో చుట్టి బాధితుడి ఇంట్లోనే దాచి పెట్టాడు. శుక్రవారం రాత్రి ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ కారణంగా తన పొరుగింటి వ్యక్తిని 26 ఏళ్ల యువకుడు హత్య చేశాడు. అతడిని పోలీసులు అరెస్టు చేశారు.
ఫుడ్ డెలివరీ ఏజెంట్‌గా పనిచేసిన నిందితుడు ఆ వ్యక్తిని హత్య చేసి, ఆ తర్వాత అతని మృతదేహాన్ని బెడ్‌షీట్‌లో కప్పి, బాధితుడి ఇంట్లోనే దాచిపెట్టాడు. ముంబయిలోని ధారవి ప్రాంతంలో 26 ఏళ్ల వ్యక్తి తన పక్కింటి వ్యక్తిని హత్య చేసి, అతని మృతదేహాన్ని బెడ్‌షీట్‌లో కప్పి బాధితుడి ఇంట్లోనే దాచి పెట్టాడని పోలీసులు సోమవారం తెలిపారు.
తల్లిని హత్య చేసి.. మృతదేహాన్ని సూట్ కేసులో కుక్కిన కూతురు..! (వీడియో)
దీంతో ఫుడ్ డెలివరీ ఏజెంట్‌గా పనిచేసిన జేమ్స్ పాల్ కనరన్ అనే నిందితుడిని ఇండియన్ పీనల్ కోడ్ సంబంధిత నిబంధనల ప్రకారం అరెస్టు చేసినట్లు షాహు నగర్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. ఈ సంఘటన శుక్రవారం, జూన్ 9న జరిగింది. ఆదివారం జూన్ 11న బాధితుడి ఇంటి నుండి మెయింటెనెన్స్ ఛార్జీలు వసూలు చేయడానికి పొరుగున ఉన్న కొందరు వెళ్లారు.
కాగా, అతని ఇంటి నుండి దుర్వాసన వెదజల్లడం గమనించారు. దీంతో విషయం వెలుగులోకి వచ్చిందని ఆయన చెప్పారు. వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. బాధితుడి కుళ్ళిన మృతదేహాన్ని ఇంట్లో బెడ్‌షీట్‌లో కప్పి ఉంచడాన్ని పోలీసులు గమనించారు. వెంటనే పంచనామా చేసి.. పోస్టుమార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారించగా.. పక్కింట్లో ఉంటే ఫుడ్ డెలివరీ బాయ్ మీద అనుమానం వచ్చిందని పోలీసులు తెలిపారు.
బాధితుడు శుక్రవారం రాత్రి నిందితుడిని తన ఇంటికి మద్యం తాగడానికి ఆహ్వానించినట్లు విచారణలో వెల్లడైంది. తరువాత వారిద్దరి మధ్య వాగ్వాదం కారణంగా అతనిపై నిందితుడు దాడి చేశాడని, దీంతో బాధితుడు అక్కడికక్కడే మృతి చెందాడని అధికారి తెలిపారు.