జాక్ డోర్సే వ్యాఖ్యలకు విపక్షాల మద్దతు: తప్పుబట్టిన అఖిలేష్ మిశ్రా

Published : Jun 13, 2023, 12:12 PM IST
జాక్ డోర్సే వ్యాఖ్యలకు విపక్షాల మద్దతు: తప్పుబట్టిన  అఖిలేష్ మిశ్రా

సారాంశం

ట్విట్టర్ మాజీ సీఈఓ  జాక్ డోర్సే  చేసిన ఆరోపణలపై  అఖిలేష్ మిశ్రా స్పందించారు. జాక్  ఆరోపణలను  ఆయన  తీవ్రంగా ఖండించారు.  

న్యూఢిల్లీ: ట్విట్టర్ మాజీ సీఈఓ  జాక్ డోర్సే  ఇండియాకు వ్యతిరేకంగా  చేసిన వ్యాఖ్యలపై  విపక్షాలు మద్దతు పలకడాన్ని బ్లూ క్రాఫ్ట్ డిజిటల్ పౌండేషన్  సీఈఓ అఖిలేష్ మిశ్రా  తప్పు బట్టారు.

ట్విట్టర్ సీఈఓగా పనిచేసిన సమయంలో  ఏం జరిగాయనే  విషయాలను  అఖిలేష్ మిశ్రా  ప్రస్తావించారు.  అమెరికా ఇంటలిజెన్స్  వ్యవస్థతో  జాక్ డోర్సెతో సంబంధాలున్నాయని  మిశ్రా ఆరోపించారు.  అంతేకాదు  అతను భారత ప్రజాస్వామ్యంలో  జోక్యం  చేసుకుంటున్న విదేశీ ఏజంట్ అని   మిశ్రా  విమర్శించారు.
జాక్ డోర్సే  హయంలో ట్విట్టర్  ఎఫ్‌బీఐ  బ్యాక్  ఆఫీ‌స్ గా  పనిచేసిందని  ఆయన  వ్యాఖ్యలు  చేశారు. అమెరికన్ ఎన్నికల్లో  జోక్యం  చేసుకొనేందుకు  పనిచేశారని  మిశ్రా  గుర్తు  చేశారు.అలాంటి  జాక్ డోర్సె నుండి  నిష్పక్షమైన  ఆటను  ఆశించలేమని  అఖిలేష్ మిశ్రా అభిప్రాయపడ్డారు. మరో వైపు బైడెన్ కు చెందిన  వాస్తవాలను  జాక్ డోర్సే   నేతృత్వంలో ట్విట్టర్  అణచివేసిందని  ఆయన గుర్తు చేశారు.  

కెనడాలో  నిరసనల సమయంలో  ట్రూడో  ప్రభుత్వం  నిరసనకారుల  ట్విట్టర్ ఖాతాలను  స్థంభింప చేశారని  అఖిలేష్ మిశ్రా ప్రస్తావించారు.  ప్రతి ఒక్కరి స్వేచ్ఛను  అణచివేశారన్నారు.  కానీ ఈ విషయం  జాక్ కు ఇబ్బంది కల్గించదన్నారు.  కానీ భారత్ దేశం  తన సార్వభౌమ చట్టాలను  వర్తింపజేస్తే  ఇబ్బంది కల్గిందని  వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 

 

జాక్ డోర్సే ట్విట్టర్ ఎండీగా ఉన్న సమయంలో  ఏ రకంగా  వ్యవహరించారో  అఖిలేష్ మిశ్రా వివరించారు.   ట్విట్టర్ ఇండియా  ఎండీగా  మనీష్ మహేశ్వరి    ప్రపంచానికి  తెలుసునన్నారు. కానీ  బాధ్యతల విషయంలో  మాత్రం  ట్విట్టర్ భాగం కాదని  పేర్కొన్న విషయాన్ని మిశ్రా గుర్తు  చేశారు. 

also read:భారత్‌కు వ్యతిరేకంగా జాక్ డోర్సె వ్యాఖ్యలు: కాంగ్రెస్‌ తీరుపై నెటిజన్ల ఫైర్

ఇలాంటి వ్యక్తికి భారత్ లోని విపక్షాలు మద్దతు ఇవ్వడాన్ని  మిశ్రా తప్పు బట్టారు. భారత్ చట్టాలను  ఉల్లంఘించిన  విదేశీ కంపెనీలో పనిచేసిన వ్యక్తికి  మద్దతు ఇవ్వడం సరైందా అని  మిశ్రా ప్రశ్నించారు.  
 

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం