
Assam floods: అసోంలో వరదల బీభత్సం కొనసాగుతోంది. రాష్ట్రంలో వరదల కారణంగా చనిపోయిన వారి సంఖ్య 18కి చేరుకుంది. అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ASDMA) ప్రకారం, 18 జిల్లాలు ఇప్పటికీ వరదలతో కొట్టుమిట్టాడుతున్నాయి. 2,42,515 మంది ప్రజలు ప్రభావితమయ్యారు. మొత్తంగా, 2,169 మంది బాధితులు ప్రస్తుతం ఏడు శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. రాష్ట్రంలోని వివిధ వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రస్తుతం 43 సహాయ పంపిణీ కేంద్రాలు కూడా పనిచేస్తున్నాయి.
వరదల కారణంగా మరో వ్యక్తి మరణించాడు. దీంతో వరదల కారణంగా చనిపోయిన వారి సంఖ్య 18కి చేరుకుందని అధికారిక బులెటిన్ తెలిపింది. ఇప్పటికీ బ్రహ్మపుత్ర నది అనేక చోట్ల ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తూనే ఉందని తెలిపింది. అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ASDMA) ప్రకారం, 18 జిల్లాలు ఇప్పటికీ వరదలతో కొట్టుమిట్టాడుతున్నాయి, 2,42,515 మంది ప్రజలు ప్రభావితమయ్యారు.
వరదల కారణంగా అత్యధికంగా దెబ్బతిన్న జిల్లా నల్బరిలో 72,427 మంది, దర్రాంగ్‌లో 69,112 మంది ఉన్నారు. ASDMA బులెటిన్ దర్రాంగ్ జిల్లాలో ఒక మరణం నివేదించబడింది. దీంతో ఈ సంవత్సరం వరదల మరణాల సంఖ్య 18కి చేరుకుంది. బ్రహ్మపుత్ర నది ధుబ్రీ, గోల్‌పరా, గౌహతి, తేజ్‌పూర్, నీమతిఘాట్‌లలో రెడ్ అలర్ట్ కొనసాగుతోంది.
మొత్తం 15,670.85 హెక్టార్లలో పంటలు ముంపునకు గురయ్యాయి. ఉదల్‌గురి జిల్లాలో ఒక వంతెన తెగిపడగా, దర్రాంగ్‌లో రెండు కట్టలు దెబ్బతిన్నాయి. వరదల్లో రోడ్లు, పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, విద్యుత్ స్తంభాలు నీటమునిగాయి.ధుబ్రీ, కమ్రూప్, కోక్రాఝర్, నల్బారి, సౌత్ సల్మారా, టిన్సుకియా ప్రాంతాల్లో కూడా పరిస్థితులు దారుణంగా మారాయి.