భారత్ శక్తి సామర్థ్యాలు వెలకట్టలేనివి: మోడీపై ట్రంప్ ప్రశంసలు

By narsimha lodeFirst Published Feb 24, 2020, 2:16 PM IST
Highlights

నమస్తే ట్రంప్ కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మోడీపై ప్రశంసలు కురిపించారు. సోమవారం నాడు మొతేరా స్టేడియంలో నమస్తే ట్రంప్ కార్యక్రమాన్ని నిర్వహించారు. 

అహ్మదాబాద్: భారతీయులు ఏమైనా సాధిస్తారని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఇందుకు ఇండియా ప్రధాని మోడీనే నిదర్శనమని ఆయన చెప్పారు.  

నమస్తే ట్రంప్ కార్యక్రమంలో  అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాల్గొన్నారు. ట్రంప్‌కు స్వాగతం పలుకుతూ మోడీ ప్రసంగించిన తర్వాత  అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రంసగించారు. తన ప్రసంగంలో  మోడీపై ప్రశంసలు కురిపించారు ట్రంప్

మోడీ గుజరాత్ రాష్ట్రమే కాదు భూప్రపంచం మొత్తం గర్వించదగిన నేత మోడీ అంటూ  ట్రంప్  ప్రశంసించారు. భారత్ శక్తి సామర్థ్యాలు వెలకట్టలేనివని ట్రంప్ చెప్పారు.

read more   ట్రంప్ పర్యటనలైవ్ అప్డేట్స్: జాతీయగీతంతో ప్రారంభమైన నమస్తే ట్రంప్....

ఇండియా ప్రధానమంత్రి  నరేంద్ర మోడీ  తన స్నేహితుడైనందుకు తాను గర్విస్తున్నట్టుగా ఆయన చెప్పారు. హౌడీ మోడీ కార్యక్రమాన్ని అమెరికా టెక్సాస్‌లోని పుట్‌బాల్ స్టేడియంలో ఐదు మాసాల క్రితం నిర్వహించిన విషయాన్ని ట్రంప్ గుర్తు చేసుకొన్నారు. 

ఇవాళ తమ పర్యటనకు సంబంధించి ప్రపంచంలోనే అతి పెద్ద   క్రికెట్ స్టేడియంలో నిర్వహించడాన్ని ఆయన ప్రస్తావించారు.  తమకు అత్యంత  సాదరంగా ఆతిథ్యం లభించడం  గుర్తుపెట్టుకొంటామని   ట్రంప్ చెప్పారు. మొతేరా స్టేడియంలో లక్షకు పైగా ప్రజలు తమకు ఆహ్వానం  పలకడం  సంతోషంగా ఉందన్నారు. 

ప్రపంచంలోనే ఎక్కువ మంది మధ్య తరగతి ప్రజలు ఉన్నారన్నారు.భారతీయ సినిమాలు అద్భుతంగా ఉంటాయన్నారు. డీడీఎల్ సినిమాను ట్రంప్ గుర్తు చేసుకొన్నారు.

యువకుడిగా ఉన్న సమయంలో మోడీ టీ షాపులో పనిచేసిన విషయాన్ని ట్రంప్ ఈ సందర్భంగా  ప్రస్తావించారు.ఇండియాలోని పండుగలు, క్రికెటర్ల గురించి ట్రంప్ తన ఉపన్యాసంలో ప్రస్తావించారు.

మానవత్వానికి భారత్ చిరునామా అంటూ  ట్రంప్ గుర్తు చేశారు. ఏడాదికి రెండు వేల సినిమాలను నిర్మిస్తున్న దేశం ఇండియా అని ఆయన గుర్తు చేశారు.  
సంస్కృతి, సంప్రదాయాలకు ఇండియా పెద్ద పీట వేస్తున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. దీపావళి, హోలీ పండుగల గురించి ట్రంప్ ప్రస్తావించారు.

read more  అమెరికా, ఇండియా సంబంధాలు మరింత బలోపేతం: నమస్తే ట్రంప్‌‌లో మోడీ

క్రికెట్‌లో ధిగ్గజాల గురించి ట్రంప్ ప్రస్తావించారు.  సచిన్  టెండూల్కర్, విరాట్ కోహ్లీలను  గురించి ట్రంప్ ప్రస్తావించారు.అమెరికన్ల హృదయాల్లో ఇండియన్లకు స్థానం ఉందన్నారు.  మతసామరస్యానికి  ఇండియా నిదర్శనమన్నారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా కూడ ఇండియన్లు కన్పిస్తారని ట్రంప్ చెప్పారు.

ఉగ్రవాదం విషయంలో అమెరికా, భారత్‌ది ఒకే సిద్దాంతమని  ట్రంప్ చెప్పారు.  రేపు సైనిక హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందంపై  రెండు దేశాల మధ్య ఒప్పందం కుదుర్చుకొంటామని ఆయన చెప్పారు. ఉగ్రవాదాన్ని తాము ఉపేక్షించబోమని  ట్రంప్ స్పష్టం చేశారు. సరిహద్దులను నియంత్రించే హక్కు దేశాలకు ఉంటుందని ట్రంప్ తేల్చి చెప్పారు. 

 రెండు దేశాల మధ్య 45 శాతం వాణిజ్య సంబంధాలు మెరుగుపడ్డాయన్నారు. రెండు దేశాల మధ్య  వాణిజ్య సంబంధాలపై ఒప్పందాలపై ప్రాథమిక స్థాయిలో చర్చలు  జరుగుతున్నాయని ట్రంప్ చెప్పారు.

ఉగ్రవాదంపై ఉమ్మడిపోరు కొనసాగుతోందని  ట్రంప్ స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని ఉగ్రవాదులను అడ్డుకోవడానికి భారత్, అమెరికాలు పోరాటం చేస్తున్నట్టు ఆయన తెలిపారు.   రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం కోసం  తాము కృషి చేస్తామని ట్రంప్ హామీ ఇచ్చారు.

 
 

click me!