Sandeshkhali Violence: ప్రధాని మోడీని కలిసిన బాధిత మహిళలు.. ‘ఇంకా వేధిస్తున్నాడు’

By Mahesh K  |  First Published Mar 6, 2024, 2:33 PM IST

సందేశ్‌ఖాలికి చెందిన ఐదుగురు మహిళలు ప్రధానమంత్రి మోడీని కలిశారు. షేక్ షాజహాన్ ఇంకా తమను వేధిస్తూనే ఉన్నాడని వాపోయారు.
 


PM Modi: పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలి నుంచి ఐదుగురు మహిళలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారు. షేక్ షాజహాన్ ఇంకా తమను వేధిస్తున్నాడని ప్రధానమంత్రి ముందు వాపోయారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బరాసత్‌లో ఓ భారీ ర్యాలీలో మాట్లాడారు. సందేశ్‌ఖాలి ఏరియా కూడా ఈ జిల్లా పరిధిలోకే వస్తుంది. ప్రధాని మోడీ ఇక్కడ ప్రసంగించిన తర్వాత సందేశ్‌ఖాలికి చెందిన ఐదుగురు బాధిత మహిళలు ప్రధానమంత్రిని కలిశారు. తమ గోడు వెల్లబోసుకున్నారు. వారి బాధను ఒక తండ్రి వలె ప్రధాని మోడీ ఆలకించారు. తమ బాధను ప్రధాని అర్థం చేసుకున్నారనే ఊరట ఆ మహిళల్లో కనిపించినట్టు బీజేపీ వర్గాలు తెలిపాయి. 

టీఎంసీ నాయకుడు షేక్ షాజహాన్ సందేశ్‌ఖాలిలో మహిళలై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలు ఉన్నాయి. బలవంతంగా పార్టీ కార్యాలయానికి రప్పించి మరి బెదిరించి లైంగికంగా వేధిస్తున్నారని అక్కడి మహిళలు చెప్పడంతో దేశమంతా భగ్గుమంది. టీఎంసీ పార్టీపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. పార్టీ వెంటనే ఆయనను సస్పెండ్ చేసింది. పోలీసులు ఆయనను అరెస్టు చేశారు.

Latest Videos

click me!