బెంగాల్ ఎన్నికలు : ఐదుగురు అభ్యర్థులకు కరోనా పాజిటివ్...

By AN TeluguFirst Published Apr 16, 2021, 7:41 PM IST
Highlights

బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఐదుగురు అభ్యర్థులకు వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ వచ్చింది. ఆరోగ్యశాఖ అధికారులు శుక్రవారంనాడు ఈ విషయం తెలిపారు. కరోనా పాజిటివ్ వచ్చిన ఐదుగురు అభ్యర్థుల్లో ముగ్గురు తృణమూల్ కాంగ్రెస్ కు చెందినవారు కాగా, బీజేపీ, ఆర్ఎస్పీ నుంచి చెరొకరు ఉన్నారు. 

రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ (అభ్యర్థి) ప్రదీప్ కుమార్ నంది(73)కు బుధవారంనాడు వైద్య పరీక్షల్లో కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్ లో ఉన్నట్టు అధికారులు చెప్పారు.

మటిగర-నక్సల్ బరి నియోజకవర్గంలో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి ఆనందమయ్ బర్మన్ (38), గోల్ పోఖర్ టీఎంసీ అభ్యర్థి మహమ్మద్ గులాం రబ్బానీ, తపన్ అభ్యర్థి కల్పన కిస్కు, జల్ పాయ్ గురి అభ్యర్థి డాక్టర్ ప్రదీప్ కుమార్ బర్మకు కూడా కోవిడ్ పాజిటివ్ వచ్చినట్టు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. 

సీఈఓ వర్గాల కథనం ప్రకారం, కరోనా పాజిటివ్ వచ్చిన అభ్యర్థి తప్పనిసరిగా ప్రచారం ఆపేయాలి. ఇన్ ఫెక్షన్ తీవ్రతను బట్టి హోం ఐసోలేషన్ లో ఉండటం కానీ, ఆస్పత్రిలో చేరడం కానీ చేయాల్సి ఉంటుంది. 

కాగా, ముర్షీదాబాద్ జిల్లా షంషేర్ గంజ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తూ కోవిడ్ పాజిటివ్ గా నిర్థారణ అయిన కాంగ్రెస్ అభ్యర్థి రెజవుల్ హఖ్ గురువారం నాడు ఆసుపత్రిలో కన్నుముశారు. 
 
click me!