2018లో, రాజకీయ నిధులలో పారదర్శకతను తీసుకురావడానికి రాజకీయ పార్టీలకు ఇచ్చే నగదు విరాళాలకు ప్రత్యామ్నాయంగా ఎలక్టోరల్ బాండ్ల పథకం తీసుకురాబడింది.
న్యూఢిల్లీ : రాజకీయ నిధుల్లో పారదర్శకత తీసుకొచ్చేందుకు రాజకీయ పార్టీలకు ఇచ్చే నగదు విరాళాలకు ప్రత్యామ్నాయంగా 2018లో ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని తీసుకొచ్చారు. దీన్ని సుప్రీంకోర్టు గురువారం కొట్టివేసింది. ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఈ పథకాన్ని సవాలు చేస్తూ దాఖలైన రెండు వేర్వేరు తీర్పులను.. ఏకగ్రీవ తీర్పులుగా వెలువరించింది.
ఎలక్టోరల్ బాండ్లపై సుప్రీంకోర్టు చేసిన ప్రధాన వ్యాఖ్యలు ఇక్కడ ఉన్నాయి:
"ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని రాజ్యాంగ విరుద్ధం అని కొట్టివేయాలి. ఇది క్విడ్ ప్రోకోకు దారి తీస్తుంది. పౌరుల సమాచార హక్కును ఉల్లంఘిస్తుంది"
ఎలక్టోరల్ బాండ్స్ రాజ్యాంగ విరుద్దం: సుప్రీం సంచలన తీర్పు
- "ఎలక్టోరల్ బాండ్లను జారీ చేసే బ్యాంకులు వీటి జారీని వెంటనే ఆపివేస్తుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలక్టోరల్ బాండ్ల ద్వారా వచ్చిన విరాళాల వివరాలను, చందాలను.. వాటిని స్వీకరించిన రాజకీయ పార్టీల వివరాలను అందిస్తుంది."
- "రాజకీయ పార్టీలకు ఆర్థిక సహకారం ఇరు వర్గాలకూ లాభం చేకూరేలా ఉంటుంది. ఒకటి రాజకీయ పార్టీకి మద్దతు కోసం లేదా పరస్పర సహకకారం క్విడ్ ప్రోకో మార్గంగా కావచ్చు.
- "అన్ని రాజకీయ విరాళాలు పబ్లిక్ పాలసీని మార్చే ఉద్దేశ్యంతో చేయబడలేదు. విద్యార్థులు, రోజువారీ కూలీలు మొదలైనవారు కూడా పార్టీ విరాళాలు ఇస్తారు. కొంతమంది ఇతర ప్రయోజనాల కోసం కూడా విరాళాలు ఇస్తుండడం వల్ల.. వీటికి రాజకీయ విరాళాలన్న ముసుగును తొలగించి, స్పష్టతనివ్వడం
"వ్యక్తుల సహకారం కంటే ఒక కంపెనీ రాజకీయ ప్రక్రియపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. కంపెనీల విరాళాలు పూర్తిగా వ్యాపార లావాదేవీలు. సెక్షన్ 182 కంపెనీల చట్టంలో చేసిన సవరణలు.. కంపెనీలు, వ్యక్తులతో సమానంగా వ్యవహరించలేవని.. తెలిపాయి''
- "నల్లధనాన్ని అరికట్టడానికి ఎలక్టోరల్ బాండ్ల పథకం ఒక్కటే కాదు. ఇతర ప్రత్యామ్నాయాలున్నాయి."
ఈ ఐదు కారణాలతో సుప్రీంకోర్టు ఎలక్ట్రోరల్ బాండ్లు రాజ్యాంగ విరుద్దం అని తీర్పునిచ్చింది.