మహారాష్ట్ర థానే పెట్ క్లినిక్‌లో కుక్కపై పిడిగుద్దులు: ఇద్దరి అరెస్ట్

By narsimha lode  |  First Published Feb 15, 2024, 10:37 AM IST

పెట్ క్లినిక్ లో  కుక్కపై దాడి చేసిన ఘటన  సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దాడికి పాల్పడిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. 


ముంబై:  మహారాష్ట్రలోని థానేలో  పెట్ క్లినిక్‌లో కుక్కపై పిడిగుద్దులు కొట్టిన  వీడియో వైరల్ కావడంతో ఇద్దరిని  పోలీసులు  అరెస్ట్ చేశారు.ఈ వీడియోపై  మంగళవారంనాడు పోలీసులకు పిర్యాదు అందింది.

థానేలోని ఆర్ మాల్ లోని ఓ పెటి క్లినిక్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. పెంపుడు జంతువుల సంరక్షణలో ఈ క్లినిక్ ప్రత్యేకత కలిగి ఉంది.పెట్ క్లినిక్ సిబ్బంది చౌ చౌ జాతికి చెందిన కుక్కను ముఖం, వీపుపై పదే పదే పిడిగుద్దులు గుద్దినట్టుగా ఈ వీడియోలో ఉంది.   ఇద్దరు వ్యక్తులు కుక్కపై దాడికి దిగారు.ఓ వ్యక్తి కుక్కను కాలితో తన్నాడు. దీంతో  కుక్క స్ట్రెచర్ పై నుండి  కిందకు దిగి గది నుండి బయటకు వెళ్లింది.ఈ వీడియోను చూసిన నెటిజన్లు  తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు.

Latest Videos

also read:హైద్రాబాద్ ఉమ్మడి రాజధాని: గడువు పెంచాలంటున్న వైఎస్ఆర్‌సీపీ, అందరి చూపు కాంగ్రెస్ వైపే

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దరిమిలా జంతు హక్కుల సంస్థ పీఏడబ్ల్యుఎస్ సంస్థ ఆఫీస్ బేరర్ నీలేష్ భాంగే పోలీసులకు ఫిర్యాదు చేశారు.బియింగ్ ది వాయిస్ ఫర్ ఆల్ ఎనిమిల్స్ పిలిచే స్ట్రీట్ డాగ్స్ ఆఫ్ బాంబే తన ఇన్ స్టాగ్రామ్ పేజీలో కుక్క వీడియోను పోస్టు చేసింది. కుక్కపై దాడి చేసిన  నిందితులను అరెస్ట్ చేసినట్టుగా తెలిపింది.

also read:రాజ్యసభకు రేణుకా చౌదరి:ఖమ్మం ఎంపీ సీటు కాంగ్రెస్‌లో ఎవరికో?

పెట్ క్లినిక్ లో దాడికి గురైన కుక్క వయస్సు మూడేళ్లు ఉంటుంది. కుక్క ఆరోగ్యం నిలకడగా ఉంది.  ఈ విషయమై  స్పందించిన ప్రజలకు, పోలీసులకు ధన్యవాదాలు తెలుపుతున్నట్టుగా బాంబే స్ట్రీట్ డాగ్స్ సంస్థ ప్రకటించింది.

click me!