ఎలక్టోరల్ బాండ్స్ రాజ్యాంగ విరుద్దం: సుప్రీం సంచలన తీర్పు

By narsimha lode  |  First Published Feb 15, 2024, 11:11 AM IST

ఎలక్టోరల్ బాండ్స్ పై సుప్రీంకోర్టు ఇవాళ సంచలన తీర్పును వెల్లడించింది


న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలఎలక్టోరల్ బాండ్స్  స్కీంపై  సుప్రీంకోర్టు  గురువారం నాడు సంచలన తీర్పును వెలువరిచింది. బ్లాక్ మనీ నిర్మూలనకు ఎలక్టోరల్ బాండ్స్ ఒక్కటే మార్గం కాదన్నారు. రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చిన వారి వివరలు రహస్యంగా ఉంచడం తగదని సుప్రీంకోర్టు పేర్కొంది.  ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ విషయంలో ఏకగ్రీవ తీర్పును వెలువరించింది.

రాజకీయ పార్టీలకు విరాళాలు క్విడ్  ప్రో కో దారి తీస్తాయని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది.  ఎలక్టోరల్ బాండ్స్ స్కీం ప్రాథమిక హక్కుల ఉల్లంఘననే సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్  డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఎలక్టోరల్ బాండ్స్ పై ఇవాళ తీర్పును వెల్లడించించింది.  ఎలక్టోరల్ బాండ్లు సమాచార హక్కుకు విరుద్దంగా  ఉన్నాయని సుప్రీంకోర్టు పేర్కొంది.

Latest Videos

ఆర్టికల్ 19 (1) ప్రకారంగా ఎలక్టోరల్ బాండ్ల పథకం సమాచార హక్కును ఉల్లంఘించడమేనని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది.2023 నవంబర్ మాసంలో  ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత  తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ చేసింది. ఇవాళ ఈ విషయమై సుప్రీంకోర్టు తీర్పును వెల్లడించింది. రాజకీయ పార్టీలు  స్వీకరించిన విరాళాలపై మొత్తం డేటాను కూడ అందించాలని కూడ సుప్రీంకోర్టు ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.

ఎలక్టోరల్ బాండ్స్ విధానంపై  అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్), కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్), కాంగ్రెస్ నాయకుడు జయ ఠాకూర్  తరపున స్పందన బిస్వాల్  సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ల తరపున  సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్, విజయ్ హన్సారియా, న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదించారు. ప్రభుత్వం తరపున అటార్నీ జనరల్ (ఏజీ) వెంకటరమణి, సొలిసిటర్ జనరల్ (ఎస్జీ) తుషార్ మెహతా వాదించారు.


ఎలక్టోరల్ బాండ్ అంటే ఏమిటి?

ఎలక్టోరల్ బాండ్ ద్వారా రాజకీయ పార్టీలకు  ఎవరైనా డబ్బును విరాళంగా ఇవ్వవచ్చు. రూ. 1000, రూ. 10 వేలు, రూ. 1లక్ష, రూ. 10 లక్షలు, కోటి రూపాయాలను ఎలక్టోరల్ బాండ్ రూపంలో అందించవచ్చు. ఎస్‌బీఐలలోని  బ్రాంచ్ లలో  ఈ బాండ్లను కొనుగోలు చేసుకోవచ్చు.

ఎన్నికల నిధుల్లో పారదర్శకతను తీసుకు రావడానికి  2017లో  ఈ బాండ్ విధానాన్ని ప్రవేశ పెట్టారు. 2018లో దీన్ని అధికారికంగా ప్రారంభించారు.రాజకీయ పార్టీలు తమ ఎన్నికల ఖర్చుల కోసం రసీదు పొందిన 15 రోజులలోపుగా ఈ బాండ్లను నగదుగా మార్చుకోవచ్చు.  జనవరి నెలలోని మొదటి పది రోజుల్లో ఈ బాండ్లను కొనుగోలు చేయవచ్చు. ప్రభుత్వం పేర్కొన్నట్టుగా ఏప్రిల్, జూలై, అక్టోబర్ సాధారణ ఎన్నికల సంవత్సరంలో  30 రోజుల వ్యవధిని బాండ్ల కోసం కేంద్రం నిర్ణయించనుంది.

ప్రజా ప్రాతినిథ్య చట్టం 1951 కింద నమోదైన రాజకీయ పార్టీలు మాత్రమే బాండ్లను పొందే వెసులుబాటు ఉంది.గత సార్వత్రిక ఎన్నికల్లో  లోక్ సభ లేదా రాష్ట్ర శాసనసభకు పోలైన ఓట్లలో  కనీసం  ఒక్క శాతం ఓట్లను  పార్టీలు పొందాలి.  అలాంటి పార్టీలకు మాత్రమే ఎలక్టోరల్ బాండ్ల కొనుగోలుకు అర్హత ఉంటుంది.

ఏం వాదించారు?

ప్రజాస్వామ్య వ్యవస్థలో పారదర్శకత లేదని  విపక్షాలు ఈ విషయమై వాదనలు విన్పించాయి.ఎలక్టోరల్ బాండ్లను ప్రవేశ పెట్టడానికి ముందు రాజకీయ పార్టీలు తమ విరాళాలను వెల్లడించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం వాదించింది. రూ. 20 వేల కంటే ఎక్కువ విరాళాలను  వెల్లడించాలని పిటిషనర్ల తరపు న్యాయవాదులు వాదించారు.ప్రభుత్వంతో పాటు ఏడీఆర్ నివేదిక ప్రకారంగా 69 శాతం  రాజకీయపార్టీలకు  గుర్తు తెలియని వ్యక్తుల నుండే వచ్చాయి.


 


 

click me!