
న్యూఢిల్లీ: హర్యానాలో దారుణం జరిగింది. కల్తీ మందు తాగి హరిద్వార్‌లోని రెండు గ్రామాలకు చెందిన ఐదుగురు మరణించినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటన పై దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం ఇప్పటికే ఏర్పడింది.
ఈ ఘటన తర్వాత ఉత్తరాఖండ్ ఎక్సైజ్ కమిషనర్ హరి చాంద్ సేమ్వాల్ ఓ ప్రకటన విడుదల చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఐదుగురు అధికారులపై సస్పెన్షన్ వేటు విధించారు. ఇందులో హరిద్వార్ జిల్లా పోలీసు అధికారి కూడా ఉన్నారు.
అదనపు ఎక్సైజ్ కమిషనర్ రిపోర్టు మీడియా రిపోర్టును ధ్రువీకరిస్తూ.. ఆ ఐదుగురి మురణానికి ప్రధాన కారణంగా ఆ కల్తీ కల్లు తాగడమే అని స్పష్టం చేసింది. సదరు లిక్కర్‌ను ఆ గ్రామ పంచాయతీ ఎన్నికలపై అభ్యర్థి పంచిపెట్టినట్టు ఓ రిపోర్టు తెలిపింది.
డీజీపీ అశోక్ కుమార్ ఈ ఘటనపై మాట్లాడారు. ఫూల్ గడ్ పంచాయతీ ఎన్నికల్లో నిలబడ్డ ఓ అభ్యర్థి పంచిన కల్తీ మద్యం తాగి ఐదుగురు మరణించినట్టు తమ ప్రాథమిక దర్యాప్తులో తేలిందని వివరించారు. అయితే, పోస్టుమార్టం తర్వాతే అసలైన కారణం బయట పడుతుందని తెలిపారు.
కాగా, సీఎం పుష్కర్ సింగ్ దామి కూడా ఈ ఘటనపై మాట్లాడారు. ఈ ఘటన పరిణామాలను ఆయన గుర్తించారు. ఈ ఘటనలో దోషులుగా గుర్తించిన వారిని కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. చట్టం తన పని తాను చేసుకుంటు వెళ్లుతుందని అన్నారు. పంచాయత్ ఎన్నికల నేపథ్యంలో అక్కడ కల్తీ మద్యం ఏరులైపారుతున్నదనే ఆరోపణలు బలంగా ఉన్నాయి.