ఘజియాబాద్‌లో సెక్స్ రాకెట్ గుట్టురట్టు.. దంపతులు సహా 11 మంది అరెస్టు

Published : Sep 11, 2022, 02:03 AM IST
ఘజియాబాద్‌లో సెక్స్ రాకెట్ గుట్టురట్టు.. దంపతులు సహా 11 మంది అరెస్టు

సారాంశం

ఉత్తరప్రదేశ్‌లో ఓ సెక్స్ రాకెట్ గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ సెక్స్ రాకెట్‌లో బ్రోకర్లుగా వ్యవహరించిన ఇధ్దరిని అరెస్టు చేశారు. మొత్తం 11 మందిని అరెస్టు చేయగా అందులో దంపతులు కూడా ఉన్నారు. ఓ గదిని అద్దెకు తీసుకుని సెక్స్ రాకెట్ నడిపినట్టు పోలీసులు తెలిపారు.  

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో సెక్స్ రాకెట్‌ను పోలీసులు చాకచక్యంగా బయటపెట్టారు. చాటుగా గుట్టుచప్పుడు కాకుండా నడుస్తున్న సెక్స్ రాకెట్‌ను నిఘా వేసి పట్టుకున్నారు. ఘజియాబాద్‌లో ఓ సెక్స్ రాకెట్ గుట్టును రట్టును చేసినట్టు పోలీసులు శనివారం వెల్లడించారు. ఈ సెక్స్ రాకెట్ అద్దెకు తీసుకున్న ఓ ఫ్లాట్‌లో నిర్వహిస్తున్నట్టు వివరించారు.

అక్కడ సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నట్టు నిఘా వర్గాలు పోలీసులకు తెలిపాయి. ఈ సమాచారం అందగానే సాహిబాబాద్ పోలీసు టీమ్ అక్కడికి చేరుకుంది. రైడ్ చేసింది. శుక్రవారం రాత్రి షాలిమార్ గార్డెన్ ఎక్స్‌టెన్షన్ 1 ఫ్లాట్‌లో పోలీసులు రైడ్ చేశారు. దీంతో సెక్స్ రాకెట్ బయటపడింది.

అనంతరం, పోలీసులు తొమ్మిది మందిని అరెస్టు చేశారు. ఇందులో ఇద్దరు సెక్స్ రాకెట్ కోసం అవసరమైన సహకారం అందించే పింప్‌లను అరెస్టు చేశారు. ఆ పింప్‌ల పేరు షారుఖ్, అంకిత్‌లుగా సాహిబాబాద్ సర్కిల్ ఆఫీసర్ స్వతంత్ర సింగ్ తెలిపారు.

కాగా, ఈ ఫ్లాట్‌ను గత నెల షారిక్, ఆయన భార్య అద్దెకు తీసుకున్నారు. ఆ తర్వాత దాన్ని ఒక బ్రోతల్ హౌజ్‌గా వినియోగిస్తున్నారని సీవో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌