జైలు సిబ్బందిపై దాడి.. పారిపోయిన ఆరుగురు ఖైదీలు: పోలీసులు

Published : Sep 11, 2022, 02:40 AM IST
జైలు సిబ్బందిపై దాడి.. పారిపోయిన ఆరుగురు ఖైదీలు: పోలీసులు

సారాంశం

మేఘాలయాలో ఓ జిల్లా కారాగారం నుంచి ఆరుగురు పారరైపోయారు. ముందుగా జైలు సిబ్బందిపై దాడి చేసి పరారవ్వడం గమనార్హం.  

న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రం మేఘాలయాలో ఓ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. విచారణలో ఉన్న ఆరుగురు ఖైదీలు జైలు సిబ్బందిపై దాడి చేశారు. జైలు గార్డులపై వారి నియంత్రణ పొందారు. అనంతరం, వారు జైలు నుంచి జారుకున్నట్టు ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిసన్త జేర్రీ ఎఫ్‌కే మారక్ వివరించారు. ఈ ఘటన వెస్ట జైనీతియా హిల్స్ జిల్లాలో శనివారం చోటుచేసుకున్నట్టు అధికారులు చెప్పారు.

ఐ లవ్ యూ తలాంగ్ అనే ఖైదీ కూడా ఆ ఆరుగురు యాక్టర్లలో ఉన్నాడు. 

రాత్రి 2 గంటల ప్రాంతంలో జైలులో విచారణ ఖైదీలుగా ఉన్న ఆరుగురు ఎస్కేప్ అయ్యారు. పక్కా ప్లాన్ ప్రకారం, వారు జైలు సిబ్బందిపై దాడి చేసి పరారయ్యారు. రాత్రి 2 గంటల ప్రాంతంలో జిల్లా జైలు నుంచి ఆరుగురు విచారణ ఖైదీలు పారిపోయినట్టు మారక్ పీటీఐకి వెల్లడించారు.

ఈ ఘటనను విచారించనున్న ఓ సీనియర్ పోలీసు అధికారి మాట్లాడుతూ, పరారైన విచారణ ఖైదీలు జైలు స్టాఫ్‌పై పట్టు సాధించారని, వారే అధికారులపై పై చేయి సాధించారని తెలిపారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ త్వరలోనే పూర్తవుతుందని వివరించారు.

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌