దేశంలో తొలి ఒమిక్రాన్ మరణం.. ధ్రువీకరించిన కేంద్ర ప్రభుత్వం

Published : Jan 05, 2022, 07:01 PM IST
దేశంలో తొలి ఒమిక్రాన్ మరణం.. ధ్రువీకరించిన కేంద్ర ప్రభుత్వం

సారాంశం

మన దేశంలో తొలి ఒమిక్రాన్ మరణం చోటుచేసుకున్నట్టు కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో 73 ఏళ్ల పేషెంట్ ఒమిక్రాన్ కారణంగా మరణించినట్టు కేంద్ర ధ్రువీకరించింది. గతంలో ఒమిక్రాన్ కారణంగా మరణం సంభవించినట్టు మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ, ప్రభుత్వం వాటిని ధ్రువీకరించలేదు.  

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు(Corona Cases) 50వేల మార్క్‌ను దాటాయి. ఒమిక్రాన్(Omicron) కేసులూ రెండు వేలనూ మించి పోయాయి. ఒమిక్రాన్ గత వేరియంట్ల కంటే వేగంగా వ్యాపిస్తుందని చెబుతూనే.. మరణాలు చాలా స్వల్పంగా ఉంటున్నాయని కొన్ని కథనాలు తెలిపాయి. ఇప్పటి వరకు మన దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా పేషెంట్లు మరణించినట్టు(Omicron Death) కేంద్ర ప్రభుత్వం చెప్పలేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా, కేంద్ర ప్రభుత్వం మన దేశంలో ఒమిక్రాన్ కారణంగా ఒకరు మరణించినట్టు ధ్రువీకరించింది. కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ ఈ విషయాన్ని వెల్లడించారు. మన దేశంలో తొలి ఒమిక్రాన్ మరణం రాజస్తాన్‌(Rajasthan)లో రిపోర్ట్ అయినట్టు వివరించారు.

73 ఏళ్ల వ్యక్తి కరోనా బారిన పడ్డారు. ఆయన శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్ చేయగా ఒమిక్రాన్ పాజిటివ్ అని తేలింది. రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లోని ఓ హాస్పిటల్‌లో డిసెంబర్ 31వ తేదీన మరణించారు. ఆయనకు డయాబెటిస్ వంటి ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు. టెక్నికల్‌గా మన దేశంలో ఒమిక్రాన్ కారణంగా మరణించిన తొలి వ్యక్తి ఆయనే అని వివరించారు.

Also Read: విస్తరిస్తోన్న కోవిడ్.. ఆదివారాల్లో పూర్తి లాక్‌డౌన్‌: తమిళనాడు సర్కార్ కీలక నిర్ణయం

డిసెంబర్ 15న ఆయనకు కొవిడ్-19 పాజిటివ్ అని తేలింది. జ్వరం, దగ్గు, ఇతర సమస్యలతో ఆయన హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యారు. కరోనా టెస్టు చేయగా పాజిటివ్ అని వచ్చింది. అనంతరం జీనోమ్ సీక్వెన్సింగ్ చేశారు. డిసెంబర్ 25న జీనోమ్ సీక్వెన్సింగ్ ఫలితంలో ఆయనకు ఒమిక్రాన్ పాజిటివ్ అని తేలింది. డయాబెటిస్, హైపర్‌టెన్షన్, హైపర్ థైరాయిడిజం వంటి దీర్ఘకాలిక వ్యాధులు, కరోనా అనంతర నిమోనియో వంటి సమస్యలతో ఆయన మరణించినట్టు ఉదయ్‌పూర్ చీఫ్ మెడికల్ హెల్ల్ ఆఫీసర్ డాక్టర్ దినేశ్ ఖరాడి వివరించారు.

మహారాష్ట్రలో (Maharashtra) ఇటీవలే ఒమిక్రాన్ తొలి మరణం చోటుచేసుకున్నట్టు కథనాలు వచ్చాయి. గుండెపోటుతో మరణించిన 52 ఏళ్ల వ్యక్తిలో ఒమిక్రాన్ వేరియంట్‌ గుర్తించబడింది. మరణించిన వ్యక్తికి నైజీరియా (Nigeria) ట్రావెల్ హిస్టరీ కూడా కలిగి ఉండటంతో దానిని ఒమిక్రాన్ మరణంగానే భావిస్తున్నారు. అయితే అతడి మరణానికి కోవిడ్ (covid) కారణం కాదని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. అయితే అతని శాంపిల్స్‌ను పుణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపగా.. ఒమిక్రాన్ పాజిటివ్‌‌గా తేలిందని చెప్పారు. ఈ మేరకు మహారాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు ఒక బులిటెన్ విడుదల చేశారు.

Also Read: కరోనా రోగుల హోం ఐసోలేషన్ ఇక నుండి ఏడు రోజులే: కేంద్రం గైడ్‌లైన్స్

తాజాగా గడిచిన 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 58,097 Covid కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ బుధవారం బులిటెన్ విడుదల చేసింది. అయితే ఇవి క్రితం రోజుతో పోల్చితే 55 శాతం అధికంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఇక, కరోనాతో మరో 534మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 4,82,551కి చేరింది. నిన్న కరోనా నుంచి 15,389 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 3,43,21,803కి చేరింది. ప్రస్తుతం దేశంలో 2,14,004 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇదిలా ఉంటే దేశంలో రోజువారీ పాజివిటీ రేటు 4.18 శాతంగా ఉంది. 

PREV
click me!

Recommended Stories

Nitin Nabin Assets Full Details | Nitin Nabin 2025 Election | Loans, Property | Asianet News Telugu
సొంతూళ్లోనే ఉంటూ రోజుకు రూ.6-7 వేల సంపాదన.. ఓ మహిళ సక్సెస్ స్టోరీ