ఢిల్లీ నుండి అయోధ్యకు మొదటి విమానం .. 'జై శ్రీ రామ్' నినాదాలతో హోరెత్తించిన ప్రయాణీకులు (వీడియో)

By Siva Kodati  |  First Published Dec 30, 2023, 5:44 PM IST

విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీ నుంచి అయోధ్యకు ఇవాళ మధ్యాహ్నం బయల్దేరింది. ఈ సందర్భంగా ఆ ఫ్లైట్ కెప్టెన్ అశుతోష్ శేఖర్.. అయోధ్య ప్రయాణికులకు స్వాగతం చెప్పగా.. వారంతా జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియిలో వైరల్ అవుతోంది. 
 


అయోధ్యలో మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ శనివారం ప్రారంభించారు. దేశంలోని పలు నగరాల నుంచి ఈ విమానాశ్రయానికి ప్రతి రోజు సర్వీసులను నడపనున్నారు. ఏడాదికి పది లక్షల మంది విమాన ప్రయాణం చేసే విధంగా ఈ విమానాశ్రయాన్ని నిర్మించారు. ఎయిర్‌పోర్టులో రామాయణ ఇతివృత్తం దర్శనమిచ్చేలా పేయింటింగ్స్ వేశారు. రూ.1450 కోట్లతో ఈ విమానాశ్రయాన్ని నిర్మించారు. విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీ నుంచి అయోధ్యకు ఇవాళ మధ్యాహ్నం బయల్దేరింది. ఈ సందర్భంగా ఆ ఫ్లైట్ కెప్టెన్ అశుతోష్ శేఖర్.. అయోధ్య ప్రయాణికులకు స్వాగతం చెప్పగా.. వారంతా జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియిలో వైరల్ అవుతోంది. 

 

First flight to Ayodhya from Delhi Commences with the chants of ‘Jai Shri Ram’ 🚩 pic.twitter.com/d9RPmGRYrW

— Megh Updates 🚨™ (@MeghUpdates)

Latest Videos

undefined

 

ఈ చారిత్రాత్మక విమానానికి నాయకత్వం వహించిన కెప్టెన్ అశుతోష్ శేఖర్.. ఇది తనకు దక్కిన గౌరవంగా తెలిపారు. ఈ ఈవెంట్ ప్రాముఖ్యతను తెలియజేస్తూ.. క్రూ మెంబర్స్‌ను పరిచయం చేస్తూ ప్రయాణీకులకు సురక్షితమైన జర్నీపై భరోసా ఇచ్చారు. ఈ పర్యటనలో విమానాలు, వాతావరణ పరిస్ధితులపై ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లను అందజేస్తానని కెప్టెన్ చెప్పారు. అనంతరం జై శ్రీరామ్ నినాదంతో ఆయన తన ప్రసంగాన్ని ముగించారు. అంతకుముందు ప్రయాణానికి ముందస్తు సన్నాహాల మధ్య ప్రయాణికులు, విమానాశ్రయ సిబ్బందితో కలిసి కేక్ కట్ చేశారు. ఫ్లైట్ ఎక్కే ముందు ప్రయాణీకులు సగర్వంగా కాషాయ జెండాలు పట్టుకుని సందడి చేశారు.

అయోధ్య విమానాశ్రయంలో సకల సౌకర్యాలు 

1,450 కోట్లకు పైగా వ్యయంతో అయోధ్యలోని అత్యాధునిక విమానాశ్రయం మొదటి దశను అభివృద్ధి చేసినట్లు PMO ఒక ప్రకటనలో తెలిపింది. కొత్త టెర్మినల్ భవనం 6,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. ఇది ఏటా సుమారు 10 లక్షల మంది ప్రయాణికులకు సేవలందించే విధంగా నిర్మించారు.  రెండవ దశ అభివృద్ధిలో 50,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో కొత్త టెర్మినల్ భవనం నిర్మించబడుతుందని, రద్దీ సమయాల్లో 3,000 మంది ప్రయాణికులు , ఏటా 60 లక్షల మంది ప్రయాణికులను నిర్వహించగల సామర్థ్యం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. 
 
టెర్మినల్ భవనం.. అయోధ్యలో నిర్మితమవుతున్న శ్రీరామ మందిర నిర్మాణాన్ని పోలి ఉంటుంది. టెర్మినల్ భవనం లోపలి భాగంలో శ్రీ రాముడి జీవితాన్ని వర్ణించేలా పెయింటింగ్‌లు, కుడ్యచిత్రాలతో అలంకరించారు. అయోధ్య విమానాశ్రయం టెర్మినల్ భవనంలో ఇన్సులేటెడ్ రూఫింగ్ సిస్టమ్, LED లైటింగ్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, ఫౌంటైన్‌లతో ల్యాండ్‌స్కేపింగ్, వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్, మురుగునీటి శుద్ధి కర్మాగారం, సోలార్ పవర్ ప్లాంట్ వంటి వివిధ సౌకర్యాలు ఉన్నాయి.

click me!