ఢిల్లీలోని ఓల్డేజ్ హోమ్ లో అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, మరొకరి పరిస్థితి విషమం..

By team teluguFirst Published Jan 1, 2023, 12:49 PM IST
Highlights

ఢిల్లీలోని ఓ ఓల్డేజ్ హోమ్ లో ఆదివారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. మరొకరికి గాాయాలు అయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది 13 మందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. 

ఢిల్లీలోని గ్రేటర్ కైలాష్ II ప్రాంతంలో ఉన్న ఓ వృద్ధాశ్రమంలో ఆదివారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. అయితే ప్రస్తుతానికి మంటలు అదుపులోకి వచ్చాయి. 

కొత్త సంవ‌త్స‌రం రోజున షాక్.. పెరిగిన వాణిజ్య ఎల్పీజీ సిలిండ‌ర్ ధ‌ర‌

ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.  గ్రేటర్ కైలాష్ II ఇ బ్లాక్‌లో ఓ వృద్ధాశ్రమం ఉంది. ఉన్నట్టుండి ఒక్క సారిగా ఈ రోజు తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. ఈ అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకున్నాయి. మంటలను ఆర్పేందుకు ప్రయత్నించాయి. అదే సమయంలో ఢిల్లీ పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. భవనంలో చిక్కుకున్న వారిని రక్షించడంలో అగ్నిమాపక సిబ్బందికి సహాయపడ్డారు. 

కరోనా కొత్త వేరియంట్ కలకలం.. ఆరోగ్య అధికారులు, నిపుణులతో పీఎంవో సమీక్ష

అగ్నిమాపక సిబ్బంది గంటల తరబడి శ్రమించి మంటలను ఆర్పివేశారు. కాగా.. ఈ అగ్నిప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు చనిపోయారని, మరో ఆరుగురిని విజయవంతంగా రక్షించామని అగ్నిమాపక శాఖ తెలిపింది. ఈ ఘటనపై సౌత్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ చందన్ చౌదరి మాట్లాడుతూ.. గ్రేటర్ కైలాష్ IIలోని సీనియర్ సిటిజన్ కేర్ హోమ్‌లో మంటలు చెలరేగాయని, ఇద్దరు మహిళలు మరణించారని తెలిపారు. ఈ ప్రమాదానికి కారణాలు ఏంటని ఇంకా తెలియరాలేదని తెలిపారు. దీనిని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.

లైంగికంగా వేధించాడని మహిళా కోచ్ ఫిర్యాదు.. హర్యానా క్రీడా మంత్రి సందీప్‌ సింగ్‌పై కేసు నమోదు..

ఢిల్లీ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మొత్తంగా 13 మందిని రక్షించారని, అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని డిప్యూటీ పోలీస్ కమిషనర్ తెలిపారు. ఇద్దరు మరణించారని చెప్పారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని అన్నారు. క్షతగాత్రులను మాక్స్ హాస్పిటల్ లో చేర్పించామని తెలిపారు. పోలీసులు, ఫైర్ సిబ్బంది రక్షించిన వారిలో సీనియర్ సిటిజన్లు, వారి సహాయకులు ఉన్నారు.

ఏం చేశాడ‌ని.. ఫడ్నవీస్ భార్య వ్యాఖ్య‌ల‌పై రాజ‌కీయ దుమారం.. మోడీ టార్గెట్ గా నితీష్ కుమార్ విమర్శలు

గత నెల 5వ తేదీన ఢిల్లీలోని కర్కర్‌దూమాలో ఉన్న ఓ హోటల్ లోని మూడో అంతస్తులో ఉదయం ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. ఈ సమాచారం అందడంతో 9 ఫైర్ ఇంజన్లు హుటా హుటిన 9 ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. కొన్ని గంటలు శ్రమించిన తరువాత మంటలు అదుపులోకి వచ్చాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

click me!