ఢిల్లీ మురికివాడలో అగ్నిప్రమాదం.. తొక్కిసలాటలో 8 మందికి గాయాలు..

By SumaBala Bukka  |  First Published Mar 3, 2023, 1:23 PM IST

అగ్నిప్రమాదం గురించి అర్ధరాత్రి 12.13 గంటలకు కాల్ వచ్చిందని, వెంటనే 21 ఫైర్ టెండర్లను మోహరించామని అధికారులు తెలిపారు. 


న్యూఢిల్లీ : ఔటర్ ఢిల్లీలోని సుల్తాన్‌పురిలోని స్లమ్ క్లస్టర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో తొక్కిసలాటలో ఎనిమిది మందికి స్వల్ప గాయాలయ్యాయని ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ అధికారులు శుక్రవారం తెలిపారు. ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ అతుల్ గార్గ్ మాట్లాడుతూ, అగ్నిప్రమాదం గురించి అర్ధరాత్రి 12.13 గంటలకు కాల్ వచ్చిందని, ఆ తర్వాత 21 ఫైర్ టెండర్లను మోహరించారు.

అగ్నిమాపక శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. మంటల్లో 200 గుడిసెలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ క్రమంలో తొక్కిసలాట కారణంగా, ఎనిమిది మందికి స్వల్ప గాయాలయ్యాయి. వారికి ప్రథమ చికిత్స అందించారు," అని గార్గ్ చెప్పారు. గాయపడిన వారిలో సూరజ్మల్ (72), కపూర్ (50), సాగర్ (25), పప్పు (55), బబ్లూ (65), కవార్ సింగ్ (52), రాజ్ సింగ్ (72), చాంద్ (55) ఉన్నట్లు ఆయన తెలిపారు. 

Latest Videos

కశ్మీర్‌లో టెర్రరిస్టులు నా వద్దకు వచ్చి మాట్లాడారు.. నన్ను చంపేసేవారు: కేంబ్రిడ్జీ యూనివర్సిటీలో రాహుల్ గాంధీ

ఇదిలా ఉండగా, ఫిబ్రవరిలో తెలంగాణలోని సంగారెడ్డిలో ఇలాంటి అగ్నిప్రమాదమే జరిగింది. సంగారెడ్డి జిల్లాలో ఘోర అగ్ని ప్రమాద ఘటన చోటు చేసుకుంది. పఠాన్ చెరు బీరంగూడలో ఆగి ఉన్న డీసీఎంలో మంటలు చెలరేగాయి. ఈ సమయంలో డీసీఎం, కారు, ఓ మినీబస్సులు వరుసగా పార్క్ చేసి ఉన్నాయి. డీసీఎంలో చెలరేగిన మంటలు.. కారు, మినీబస్సుకు వ్యాపించాయి. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి.

డీసీఎంలో ఓ రకమైన మంటలను ప్రేరేపించే ద్రావణం ఉండడం.. అది కారడంతోనే ఈ ప్రమాదం సంభవించినట్టు ప్రాథమిక అంచనాకు వస్తున్నారు. అయితే, మూడు వాహనాలు ఆగి ఉన్న సమయంలోనే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ఈ ప్రమాద గురించి తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపులోకి తీసుకువచ్చారు. 

అగ్ని ప్రమాదంలో మూడు వాహనాలు పూర్తిగా దగ్థం అయ్యాయి. కానీ ఎవ్వరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది. అగ్ని ప్రమాదం జరిగిన వెంనటే.. మినీ బస్సులో ఉన్నవారిని రక్షించడానికి స్థానికులు ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

click me!