ఈ నెల 8న బెంగళూరుకి.. 23న శవమై తేలిన ఏకే రావు, ఎఫ్ఐఆర్‌లో కీలక విషయాలు

By Siva KodatiFirst Published Nov 25, 2021, 5:32 PM IST
Highlights

ప్రముఖ నేపథ్య గాయనీ హరిణీ (singer harini father) తండ్రి ఏకే రావు (ak rao) అనుమానాస్పద మృతి కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదైంది. దీంట్లో కీలక విషయాలు వెలుగుచూశాయి. అతని తల ఎడమవైపున ఆరు సెంటిమీటర్ల పొడవైన గాయం వున్నట్లుగా గుర్తించారు పోలీసులు. ఎడమ చేయి, గొంతుపైనా గాయాలు వున్నట్లుగా గుర్తించారు

ప్రముఖ నేపథ్య గాయనీ హరిణీ (singer harini father) తండ్రి ఏకే రావు (ak rao) అనుమానాస్పద మృతి కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదైంది. దీంట్లో కీలక విషయాలు వెలుగుచూశాయి. ఈ నెల 23వ తేదీన బెంగళూరు (bangalore) శివార్లలోని (yelahanka) యలహంక -రాజన్న కుంట రైల్వే స్టేషన్‌ల మధ్య ఏకే రావు మృతదేహం కనిపించింది. నాందేడ్ ఎక్స్‌ప్రెస్ కో పైలట్ మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందజేశారు. అతని తల ఎడమవైపున ఆరు సెంటిమీటర్ల పొడవైన గాయం వున్నట్లుగా గుర్తించారు పోలీసులు. ఎడమ చేయి, గొంతుపైనా గాయాలు వున్నట్లుగా గుర్తించారు. ఘటనా స్థలంలో చాకు, కత్తి, బ్లేడ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వెంటనే మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఎమ్మెస్ రామయ్య ఆసుపత్రికి తరలించారు. మృతుడి దగ్గర వున్న మొబైల్ నెంబర్ ఆధారంగా కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. 

మృతుడు ఏకే రావు కుమారుడు వచ్చి అక్కడ లభ్యమైన మృతదేహం తన తండ్రిదేనని గుర్తించారు. అతను ఒక ప్రాజెక్ట్ పని మీద అప్పుడప్పుడు బెంగళూరు వస్తుంటాడు. ఈ నెల 8న అక్కడికి వచ్చిన ఏకే రావు.. తన కుమారుడి ఇంట్లోనే వున్నాడు. 23న ఏకే రావు భార్య.. బెంగళూరులో వున్న కుమారుడికి ఫోన్ చేశారు. భర్త చనిపోయినట్లు, రైల్వే పోలీసుల నుంచి ఫోన్ వచ్చిందని, రైల్వే ట్రాక్‌పై మృతదేహం వున్నట్లుగా చెప్పారని కుమారుడికి సమాచారం ఇచ్చారామె. ఒంటిపై వున్న గాయాలను చూసి ఏకే రావును వేరే ప్రాంతంలో హత్య చేసి రైల్వే ట్రాక్‌పై పడేశారని కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ కేసులో లోతైన దర్యాప్తు చేసి న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. కుటుంసభ్యుల ఫిర్యాదు మేరకు బెంగళూరు రూరల్ రైల్వే పోలీస్ స్టేషన్‌లో 174 సీఆర్‌పీసీ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. 

ALso Read:సుజనా పౌండేషన్ సీఈఓ ఏకే రావు మృతిపై సమాచారం లేదు: హైద్రాబాద్ సీపీ అంజనీకుమార్

మరోవైపు ఏకే రావు మృతిపై హైద్రాబాద్ సీపీ (hyderabad police commissioner) అంజనీకుమార్ (anjani kumar) స్పందించారు. ఏకే రావు కుటుంబం అదృశ్యమైనట్టుగా కూడా తమకు సమాచారం లేదన్నారు. ఈ విషయమై తమకు ఎవరూ కూడా ఫిర్యాదు చేయలేదని ఆయన తెలిపారు. బెంగుళూరు పోలీసుల నుండి కూడా తమకు సమాచారం లేదని Anajani kumar చెప్పారు..  ఈ విషయమై బెంగుళూరు పోలీసుల నుండి సమాచారం తెప్పించుకొని విచారణ  చేస్తామని Hyderabad CP తెలిపారు.

వారం రోజులుగా ప్రముఖ సింగర్ హరిణి కుటుంబం అదృశ్యమైనట్టుగా సమాచారం. హైద్రాబాద్ లోని శ్రీనగర్ కాలనీలో నివాసం ఉండే ఏకే రావు కుటుంబ సభ్యులు వరాం రోజులుగా కన్పించడం లేదని స్థానికులు తెలిపారు. అయితే  మూడు రోజుల క్రితం ఏకే రావు  బెంగుళూరులోని  రైల్వే ట్రాక్ పై అనుమానాస్పదస్థితిలో మరణించాడు. అయితే  తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహంపై ఉన్న గాయాల ఆధారంగా హత్య కేసుగా నమోదు చేశారు.  ఈ హత్యకు ముందు ఏకే రావు ఆర్ధిక వివాదానికి సంబంధించి పోలీసులకు  ఫిర్యాదు చేశారని సమాచారం. అయితే ఈ ఫిర్యాదు  ఇచ్చిన  తర్వాత ఏకే రావు  మృతి చెందడం ప్రస్తుతం కలకలం రేపుతుంది. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలో విధులు నిర్వహించిన తర్వాత ఏకే రావు రిటైరయ్యారు.  ఉద్యోగ విరమణ తర్వాత ఆయన సుజనా పౌండేషన్ (sujana foundation) లో సీఈఓగా పనిచేస్తున్నారు. అయితే ఏకే రావుకు మరెవరితో ఆర్ధిక పరమైన లావాదేవీలు చోటు చేసుకొన్నాయనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. 


 

click me!