అస్సాంలో బలమైన ఈదురుగాలులు పెను నష్టాన్ని మిగిల్చాయి. వందల మంది నిరాశ్రయులయ్యారు. దాదాపు 400కు పైగా ఇళ్లు దెబ్బతిన్నాయి. ఇళ్లు కూలడంతో ఏడేళ్ల బాలుడు మృతి చెందాడు.
అస్సాంలోని కరీంగంజ్ జిల్లాలో భీకర తుఫాను సంభవించింది. బలమైన ఈదుగుగాలుల వల్ల 400 ఇళ్లు ధ్వంసం అయ్యాయి. అనేక ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. ఈ ఘటనల్లో ఒకరు మరణించారు. తుపాను కారణంగా నివాసాలపై ఉన్న పైకప్పులు ఎగిరిపోయాయి. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
జగిత్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సును ఢీకొట్టిన లారీ.. ఒకే కుటుంబానికి చెందిన 25 మందికి గాయాలు..
కాగా.. తుఫాను వల్ల 400కు పైగా ఇళ్లు దెబ్బతిన్నాయని పథర్కండి రెవెన్యూ సర్కిల్ ఆఫీసర్ అర్పితా దత్తా మజుందార్ తెలిపారు. ఓ ఇళ్లు కూలిపోవడంతో అందులో ఉన్న ఏడేళ్ల బాలుడు మరణించారని చెప్పారు. పథర్కండిలో కేవలం ఐదు గ్రామ పంచాయతీలకు చెందిన 428 కుటుంబాలు తుఫాను ప్రభావానికి గురయ్యాయని ఆయన తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం నష్టపరిహారం చెల్లిస్తామని ఆయన పేర్కొన్నారు.
| Several houses were damaged after a severe storm hit several places in Assam's Karimganj district. According to the district administration, one person died, and many trees and electric poles were uprooted in the storm-affected areas. pic.twitter.com/XD6uT9VGLi
— ANI (@ANI)కాగా.. రానున్న మూడు రోజుల్లో ఈశాన్య భారతంలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో తేలికపాటి నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. నేడు అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.