ఢిల్లీలో దొంగతనం కేసు.. నలుగురు పోలీసులు అరెస్టు

By Mahesh K  |  First Published Apr 22, 2023, 5:01 AM IST

ఢిల్లీలో బుధవారం ఓ ఇంటిలో దొంగతనం జరిగింది. రూ. 10 లక్షల నగదు పట్టుకుని పారిపోయారు. ఈ కేసులో ఢిల్లీ పోలీసులు మొత్తం ఐదుగురిని అరెస్టు చేశారు. అందులో నలుగురూ ఢిల్లీ పోలీసు కావడం గమనార్హం.
 


న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం రాత్రి ఓ దొంగతనం జరిగింది. ఈ కేసులో ఢిల్లీ పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు. అందులో నలుగురు పోలీసులే ఉండటం గమనార్హం. ఈశాన్య ఢిల్లీలోని సాగర్‌పుర్ ఏరియాలో బుధవారం, గురువారం మధ్య రాత్రి ఈ చోరీ జరిగింది.

నిందితులుగా చేర్చిన ఢిల్లీ పోలీసులు విజయ్ శర్మ, దీపక్ యాదవ్, మంజేష్ రాణా, అంకిత్ కాసాన. వీరితోపాటు రోహిణి నివాసి మనీష్ రాయ్‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారు.

Latest Videos

పోలీసుల వివరాల ప్రకారం, రజనీశ్ అనే వ్యక్తి ఇంటిలో బుధవారం రాత్రి ఈ చోరీ జరిగింది. నలుగురు వ్యక్తులు తమ ఇంట్లోకి దూరారు. రజనీశ్‌ను బెదిరించారు. ఇంట్లోని సుమారు రూ. 10.40 లక్షల నగదును పట్టుకుని పారిపోయారు.

Also Read: ఢిల్లీలో సహజీవన భాగస్వామి దారుణ హత్య.. 12 కి. మీ ల దూరంలో డెడ్ బాడీ

రజనీశ్ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు సెక్షన్ 394 కింద కేసు నమోదు చేశారు. ఈ దర్యాప్తు మొదలయ్యాక నలుగురరు పోలీసులను అదుపులోకి తీసుకున్నారని ఓ సీనియర్ పోలీసు అధికారి వెల్లడించారు. ఆ తర్వాత వారిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు.

నిందితుడైన మనీష్ రాయ్.. గతంలో రజనీశ్ కింద పని చేశాడని పోలీసులు వివరించారు.

click me!