ముందస్తు బెయిల్‌ కోసం నేరస్తుల కరోనా సాకు: హైకోర్టులకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు

By Siva KodatiFirst Published May 25, 2021, 4:46 PM IST
Highlights

ముందస్తు బెయిల్‌లకు సంబంధించి హైకోర్టులకు నూతన మార్గదర్శకాలను సూచించింది సుప్రీంకోర్ట్. అరెస్టు చేసి జైలుకు పంపిస్తే కొవిడ్‌తో చనిపోతారన్న భయాన్ని ఆధారంగా చేసుకుని ముందస్తు బెయిల్‌ మంజూరు చేయవద్దని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఇటీవల ముందస్తు బెయిల్‌పై అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం స్టే విధించింది.  

ముందస్తు బెయిల్‌లకు సంబంధించి హైకోర్టులకు నూతన మార్గదర్శకాలను సూచించింది సుప్రీంకోర్ట్. అరెస్టు చేసి జైలుకు పంపిస్తే కొవిడ్‌తో చనిపోతారన్న భయాన్ని ఆధారంగా చేసుకుని ముందస్తు బెయిల్‌ మంజూరు చేయవద్దని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఇటీవల ముందస్తు బెయిల్‌పై అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం స్టే విధించింది.  .  

వివరాల్లోకి వెళితే.. ఓ కేసులో నిందితుడిగా ఉన్న ప్రతీక్‌ జైన్‌ అనే వ్యక్తి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై అలహాబాద్‌ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అరెస్టుకు ముందు లేదా తర్వాత గానీ నిందితుడికి వైరస్ సోకితే.. అది అతడి నుంచి పోలీసులు, కోర్టులు, జైలు సిబ్బందికి వ్యాపించే ప్రమాదం ఉందని అభిప్రాయపడింది. వైరస్‌తో ప్రాణభయం కూడా ఉందని.. అందువల్ల నిందితుడికి ముందస్తు బెయిల్‌ ఇచ్చేందుకు ఇది సరైన కారణమేనని అలహాబాద్ బెంచ్ తీర్పు వెలువరించింది.  

Also Read:గుడ్‌న్యూస్: ఇండియాలో తగ్గుతున్న కరోనా కేసులు, మరణాలు

అయితే ఈ తీర్పును సవాల్‌ చేస్తూ ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.. కరోనా వైరస్ ఇప్పుడప్పుడే పూర్తిగా తొలగిపోయే అవకాశం లేనందున ఈ కారణం చూపి నిందితుడికి బెయిల్‌ ఇవ్వడం సరికాదని యూపీ సర్కార్ అభిప్రాయపడింది. అంతేగాక, దీనిని అవకాశంగా తీసుకుని నేరస్తులు స్వేచ్ఛగా బయట తిరుగుతారని పేర్కొంది.

దీనిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం కొవిడ్‌ భయాన్ని కారణంగా చూపి నిందితులకు ముందస్తు బెయిల్‌ ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వులను ఇతర కోర్టులు పరిగణనలోకి తీసుకోవద్దని తెలిపింది. కేసు అర్హతలను బట్టి మాత్రమే బెయిల్‌పై నిర్ణయం తీసుకోవాలని హైకోర్టులకు సూచించింది.   

click me!