అప్పుడు కాదు పొమ్మంది... ఇప్పుడు వెయిటింగ్ లిస్ట్‌: మోడెర్నా, ఫైజర్‌ల విషయంలో భారత్‌ పొరపాటు

By Siva KodatiFirst Published May 25, 2021, 4:11 PM IST
Highlights

భారతదేశంలో టీకాల కొరత ఎంత తీవ్రంగా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ క్రమంలో విదేశీ టీకాలపైనా భారత్ ఎన్నో ఆశలు పెట్టుకుంది. అయితే అమెరికాకు చెందిన ఫైజర్, మోడెర్నా సంస్థలతో సంప్రదింపులు జరుపుతోంది.

భారతదేశంలో టీకాల కొరత ఎంత తీవ్రంగా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ క్రమంలో విదేశీ టీకాలపైనా భారత్ ఎన్నో ఆశలు పెట్టుకుంది. అయితే అమెరికాకు చెందిన ఫైజర్, మోడెర్నా సంస్థలతో సంప్రదింపులు జరుపుతోంది. అయితే కేంద్రం ప్రయత్నాలు ఫలించే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి.

ఫైజర్, మోడెర్నా టీకాలకు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్ ఏర్పడడంతో, భారత్ లో 2023 వరకు ఈ టీకాలు అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపించడంలేదు. అంతేకాదు ఇప్పటికే బుక్ చేసుకున్న దేశాలకు టీకాలు సరఫరా చేసేందుకే ఫైజర్, మోడెర్నాలకు  రెండేళ్లు పడుతుందని అంచనా.

Also Read:మాకొద్దు బాబోయ్... వ్యాక్సిన్ సిబ్బందిపై క‌ర్ర‌ల‌తో గ్రామ‌స్థుల దాడి, వీడియో వైరల్

ఒక రకంగా భారత్ మంచి అవకాశాన్ని చేజార్చుకుందని చెప్పాలి. ఫైజర్ తన టీకాకు అత్యవసర అనుమతుల కోసం గతంలోనే కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. అయితే ఫైజర్ టీకా ఎం-ఆర్ఎన్ఏ కేటగిరికీ చెందినదంటూ నిపుణుల కమిటీ దాన్ని తిరస్కరించింది. దాంతో ఫైజర్ .. ఇండియాలో మరోసారి దరఖాస్తు చేసేందుకు ఆసక్తి చూపించలేదు.

అయితే, గత కొన్ని నెలలుగా మనదేశంలో రెండో దశ తీవ్రతరం కావడంతో కేంద్రం మనసు మార్చుకుంది. విదేశీ వ్యాక్సిన్లకు సంబంధించిన అనుమతుల ప్రక్రియను సరళతరం చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతించిన, ఇతర దేశాల్లో వినియోగంలో ఉన్న వ్యాక్సిన్లకు భారత్ లో 2,3వ దశ క్లినికల్ ట్రయల్స్ అవసరం లేదని వెల్లడించింది. కానీ, ఇండియా అప్పటికే ఆలస్యం చేసింది. ఫైజర్, మోడెర్నా సంస్థల వ్యాక్సిన్ల కోసం అనేక దేశాలు ముందే ఒప్పందాలు చేసుకోవడంతో భారత్ వెయిటింగ్ లిస్ట్‌లో పడింది. 

click me!