మాకొద్దు బాబోయ్... వ్యాక్సిన్ సిబ్బందిపై క‌ర్ర‌ల‌తో గ్రామ‌స్థుల దాడి, వీడియో వైరల్

By Siva KodatiFirst Published May 25, 2021, 3:37 PM IST
Highlights

ఓ వైపు దేశంలోని ప్రజలు కరోనా భయంతో వ్యాక్సిన్ తీసుకునేందుకు ఎగబడుతున్నారు. చాలినన్ని డోసులు లేకపోవడంతో నిరాశకు గురవుతున్నారు. ఇందుకు సంబంధిం ప్రతిరోజూ ఎన్నో వార్తలు చూస్తున్నాం. అయితే కొన్ని చోట్ల మాత్రం ఇందుకు భిన్నమైన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి

ఓ వైపు దేశంలోని ప్రజలు కరోనా భయంతో వ్యాక్సిన్ తీసుకునేందుకు ఎగబడుతున్నారు. చాలినన్ని డోసులు లేకపోవడంతో నిరాశకు గురవుతున్నారు. ఇందుకు సంబంధిం ప్రతిరోజూ ఎన్నో వార్తలు చూస్తున్నాం. అయితే కొన్ని చోట్ల మాత్రం ఇందుకు భిన్నమైన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.

దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ప్ర‌జ‌ల‌కు వ్యాక్సిన్‌పై ఉన్న భ‌యం, అపోహలు ఇంకా పోలేదు. అది వేయించుకుంటే అనారోగ్యానికి గుర‌వుతామ‌ని పలువురు భావిస్తున్నారు. అంతటితో ఆగకుండా వ్యాక్సిన్ సిబ్బందిపై దాడుల‌కు సైతం దిగుతున్నారు. తాజాగా మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ఇలాంటి ఘ‌ట‌నే చోటు చేసుకోవ‌డంతో వ్యాక్సిన్ సిబ్బంది బతుకు జీవుడా అంటూ పారిపోయారు.

Also Read:గుడ్‌న్యూస్: ఇండియాలో తగ్గుతున్న కరోనా కేసులు, మరణాలు

ఈ తతంగాన్ని వీడియో తీసిన ఒక‌రు ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. ఉజ్జయిని జిల్లా మెయిల్‌ఖేడీ గ్రామంలో వ్యాక్సిన్ అంటేనే వ‌ణికిపోతోన్న గ్రామ‌స్థుల‌కు అవగాహన కల్పించేందుకు అధికారులు అక్క‌డ‌కు వెళ్లారు. వారి రాక‌ను ముందుగానే గుర్తించిన  గ్రామస్థులు క‌ర్ర‌లు ప‌ట్టుకుని సిద్థంగా ఉన్నారు.

వ్యాక్సిన్ సిబ్బంది గ్రామంలోకి అడుగుపెట్ట‌గానే రాళ్లు, కర్రలు పట్టుకుని కొట్ట‌డానికి ఎగబడ్డారు. కొంద‌రు అధికారులు త‌ప్పించుకుని కారులో పారిపోగా, పంచాయతీ అధికారిణికి ఈ ఘటనలో తీవ్రగాయాల‌య్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు భారీగా మోహరించి ప‌రిస్థితులు చేజారకుండా చ‌ర్య‌లు తీసుకున్నారు.

click me!