కొత్తగా పెళ్లైన యువతిని చంపే ప్రయత్నం చేసిన తండ్రి.. ఎందుకో తెలుసా?

Published : Apr 27, 2023, 06:08 AM IST
కొత్తగా పెళ్లైన యువతిని చంపే ప్రయత్నం చేసిన తండ్రి.. ఎందుకో తెలుసా?

సారాంశం

ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి పరువు కోసం కన్న బిడ్డనే చంపాలని అనుకున్నాడు. ఇష్టపడ్డ అబ్బాయిని పెళ్లి చేసుకుంటానని బిడ్డ కోరగా..పరువు పోతుందని వారించి మరో అబ్బాయితో పెళ్లి చేశారు. ఆ తర్వాత కూడా ప్రేమించిన అబ్బాయితోనే ఉండాలని అనిపిస్తున్నదని కూతురు చెప్పగా..ఆమెను చంపాలని నిర్ణయించుకున్నారు. కుటుంబ సభ్యులే కలిసి చంపే ప్రయత్నం చేశారు. కానీ, అదృష్టవశాత్తు ఆమె బతికింది.  

న్యూఢిల్లీ: పెళ్లి జరిగిన గంటల వ్యవధిలోనే 25 ఏళ్ల యువతి దాదాపు నగ్నంగా, సుమారు 40 శాతం కాలిన గాయాలతో కనిపించింది. ఆమెను హాస్పిటల్ తీసుకెళ్లగా.. ఇప్పుడే కోలుకుంటున్నది. ఢిల్లీ నుంచి లక్నోకు వెళ్లే హైవేపై ఆ యువతి దాదాపు స్పృహ కోల్పోయిన స్థితిలో లభించింది. ఆ యువతిని కన్న తండ్రే చంపే ప్రయత్నం చేశాడు. ఆమె చనిపోయిందని రోడ్డు పక్కన పొదల్లో పడేసి వెళ్లిపోయాడు. కానీ, అదృష్టవశాత్తు ఆమె ప్రాణాలు దక్కించుకుంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో చోటుచేసుకుంది.

తోతారామ్, ఆయన బావ దినేశ్ కుమార్‌లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ హత్యాయత్నంలో మరికొందరు కుటుంబ సభ్యుల ప్రమేయం ఉన్నదని తెలిసింది. వారికోసం పోలీసులు గాలిస్తున్నారు.

బాధిత యువతికి ఇటీవలే పెళ్లి జరిగింది. ఆమె పక్కింటి అబ్బాయిని ఇష్టపడింది. కానీ, కుటుంబం వారించింది. ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే పరువు పోతుందని పేర్కొంది. వెంటనే మరో అబ్బాయిని చూసి పెళ్లి చేయించారు. ఆ తర్వాత కూడా ఒకసారి తండ్రి వద్దకు వచ్చి తనకు తాను ప్రేమించిన అబ్బాయితో ఉండాలని అనిపిస్తున్నదని చెప్పింది. దీంతో తండ్రి, తన సోదరుడు, బావ, కజిన్‌లతో కలిసి ఇల్లు వదిలాడు. ఇంటికి తిరిగివస్తూ పరువు కోసం బిడ్డను చంపేయాలనే నిర్ణయానికి వచ్చాడు.

ఆ వ్యక్తి బైక్ రోడ్డు పక్కన పార్క్ చేసి బిడ్డను దింపి గొంతు నులిమాడు. టాయిలెట్ క్లీన్ చేసే యాసిడ్ కొనాలని కొడుకును ఆదేశించాడు. ఆ యాసిడ్‌ను ఆమె గొంతు, దేహంపై పోశారు. అప్పటికే ఆమె మరణించిందని అక్కడే వదిలిపెట్టి వెళ్లిపోయారు. మరునాడు ఉదయం బాటసారులు ఆమెను చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆమెను హాస్పిటల్ తరలించారు.

Also Read: Maoist Attack: ఉదయమే ఎన్‌కౌంటర్.. మధ్యాహ్నం ఆర్మీ వ్యాన్ పేల్చివేత.. 20 కి. మీల దూరం లోనే ఘటన

పోలీసులు తోతారామ్‌కు ఫోన్ చేసి ఆయన బిడ్డ తమ వద్దే ఉన్నదని, రోడ్డు పక్కన కనిపించిందని చెప్పగా.. ఆయన షాక్ అయ్యాడని పోలీసులు తెలిపారు. తన బిడ్డ పెళ్లి చేసుకుందని, అల్లుడి వద్ద ఉన్నదని బుకాయించే ప్రయత్నం చేశాడు. దీంతో ఆమె ఫొటోలను తోతారామ్‌కు పంపించగా.. ఆమె తన బిడ్డ కాదని అన్నాడు. కానీ, మీరంతా కలిసి రెస్టారెంట్‌లో భోజనం చేసిన సీసీటీవీ ఫుటేజీ ఉన్నదని పోలీసులు సమాధానం ఇచ్చారు.

PREV
click me!

Recommended Stories

IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు
Nuclear Devices in Himalayas : నెహ్రూ, ఇందిరాలే ప్రస్తుత ప్రకృతి విపత్తులకు కారణమా..?