ఏటీఎం చోరీకి ఏటీఎం బాబా క్రాష్ కోర్స్.. బిహార్‌లో వెలుగులోకి

Published : Apr 27, 2023, 05:41 AM IST
ఏటీఎం చోరీకి ఏటీఎం బాబా క్రాష్ కోర్స్.. బిహార్‌లో వెలుగులోకి

సారాంశం

బిహార్‌లో ఏటీఎం చోరీల కోసం ప్రత్యేకంగా ఓ వ్యక్తి క్రాష్ కోర్సు ఇస్తున్నట్టు వెలుగులోకి వచ్చింది. ఇటీవలే యూపీలోని లక్నోలో ఎస్‌బీఐ ఏటీఎం చోరీ కేసు దర్యాప్తులో ఈ విషయం బయటపడింది. ఏటీఎం బాబాగా పిలుచుకునే సుధీర్ మిశ్రా.. ఈ ట్రెయినింగ్ ఇస్తున్నట్టు సమాచారం.  

న్యూఢిల్లీ: 15 నిమిషాల్లో ఏటీఎంను బద్దలు కొట్టడం ఎలా? ఏటీఎం లూటీని నేర్చుకోండి... వీటిని బిహార్‌లోని ఛాప్రాకు చెందిన ఏటీఎం బాబా నేర్పుతున్నాడని వెలుగులోకి వచ్చింది. కొందరు ఏటీఎం దొంగతనాలు చేసిన నిందితులను ఇంటరాగేట్ చేస్తున్న సమయంలో ఏటీఎం బాబాగా పిలుచుకునే సుధీర్ మిశ్రా గురించి పోలీసులకు తెలియవచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఇటీవలే చోటుచేసుకున్న ఏటీఎం చోరీ కేసు దర్యాప్తు చేస్తుండగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

లక్నలోని ఎస్‌బీఐ ఏటీఎం మెషీన్‌ను మొత్తంగా ఎత్తుకెళ్లి రూ. 39.58 లక్షలను చోరీ చేసుకున్నారు. కేవలం 16 నిమిషాల్లోనే ఈ దొంగతనాన్ని పూర్తి చేశారు. అయితే, ఈ దొంగతనం ఎలా చేయాలనేదానిపై ముందుగానే ఏటీఎం బాబా ఆ దొంగలకు ప్రాక్టీస్ చేయించాడని తెలిసింది. ఈ కేసులో ఏటీఎం బాబా అనుచరులు, మిత్రులను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.

లక్నోలోని సుల్తాన్‌పూర్ రోడ్ పై ఏటీఎం మెషీన్ ఉన్న ఏరియాలో బ్లూ కలర్ పల్సర్ పై ఇద్దరు రెక్కీ వేశారు. ఆ తర్వాత నలుగురిని హర్యానా నుంచి రప్పించారు. ఆ గ్రూపు ఏప్రిల్ 3వ తేదీన చోరీకి వెళ్లారు. ఇద్దరు వ్యక్తులు మాత్రం ఏటీఎం బయటే అలర్ట్ చేయడానికి నిలబడి ఉన్నారు. 16 నిమిషాల్లో లోపల ఉన్నవారు ఏటీఎంను మొత్తంగా ఎత్తుకెళ్లడం పూర్తి చేశారు. 

Also Read: Maoist Attack: ఉదయమే ఎన్‌కౌంటర్.. మధ్యాహ్నం ఆర్మీ వ్యాన్ పేల్చివేత.. 20 కి. మీల దూరం లోనే ఘటన

ఓ రోజు రాత్రి బ్యాలెనో కారులో నిందితులు నీరజ్ మిశ్రా తివారీ, పంకజ్ కుమార్పాండే, కుమార్ హాస్కర్ ఓజాలను అరెస్టు చేశారు. ఇంటరాగేషన్‌లో వారు రూ. 39,58,000 దొంగిలించినట్టు చెప్పారు. వారు ఫ్లాట్‌లో దాచిన డబ్బు నూ  రికవరీ చేసుకున్నారు. ఏటీఎం చోరీకి ఉప యోగించిన పరికరాలనూ స్వాధీనం చేసుకున్నారు. ఈ ఏటీఎం చోరీ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. మిగిలిన నిందితు లనూ త్వరలోనే పట్టుకుంటామని పోలీ సులు చెప్పారు.

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?