పాము కాటుతో మూడేళ్ల కొడుకు మృతి : నా బిడ్డ చావలేదు, డాక్టర్లు చెప్పినా వినని తండ్రి.. తాంత్రికుడి కోసం వెళ్లి

Siva Kodati |  
Published : Jul 11, 2023, 04:05 PM IST
పాము కాటుతో మూడేళ్ల కొడుకు మృతి : నా బిడ్డ చావలేదు, డాక్టర్లు చెప్పినా వినని తండ్రి.. తాంత్రికుడి కోసం వెళ్లి

సారాంశం

ఛత్తీస్‌గఢ్‌‌లోని సూరజ్‌పూర్ జిల్లాలో ఆశిష్ అనే మూడేళ్ల చిన్నారి ఇంట్లో నిద్రిస్తూ వుండగా పాము కాటుతో మరణించాడు. అయితే తన బిడ్డ చనిపోలేదని వాదిస్తూ అతనిని బతికిస్తానని ఓ తాంత్రికుడిని తీసుకొద్దామని వెళ్లాడు. 

ఓ వైపు భారతదేశం శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అగ్రరాజ్యాలతో పోటీపడుతుంటే మనదేశంలో మూఢ నమ్మకాలు మాత్రం పోవడం లేదు. గ్రామీణులే కాదు ఐఐటీల్లో చదివిన ఉన్నత విద్యావంతులు సైతం మూఢ నమ్మకాలతో జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తాజాగా ఛత్తీస్‌గఢ్‌లో ఇదే తరహా ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. సూరజ్‌పూర్ జిల్లాలో ఆశిష్ అనే మూడేళ్ల చిన్నారి ఇంట్లో నిద్రిస్తూ వుండగా పాము కాటుతో మరణించాడు. దీనిని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆ సర్పాన్ని ఓ సీసాలో బంధించారు. 

ఆశిష్‌ను ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. తమ కుమారుడి మరణంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అయితే ఆశిష్ తండ్రి లాల్ బహదూర్ మాత్రం కొడుకు మరణాన్ని జీర్ణించలేకపోయాడు. తన బిడ్డ ఇంకా బతికే వున్నాడని చెబుతూ.. తన కొడుకుని కరిచిన పాముని తీసుకుని ఓ తాంత్రికుడిని వెతుకుతూ వెళ్లాడు. అయితే అతనికి మాంత్రికుడు కనిపించకపోవడంతో బిడ్డ బతకడని నిర్ణయించుకున్నాడు. చివరికి డాక్టర్లు పోస్ట్‌మార్టం అనంతరం ఆశిష్ మృతదేహాన్ని పోలీసులకు అప్పగించారు. అనంతరం సీసాలో బంధించిన పామును కుటుంబ సభ్యులు వదిలిపెట్టారు. 

ఈ ఘటనపై సూరజ్‌పూర్ చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ ఆర్ఎస్ సింగ్ మాట్టాడుతూ.. తమ ప్రాణాలను కూడా పణంగా పెట్టే స్థాయిలో ప్రజలు మూఢ నమ్మకాలను విశ్వసిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వాటిని వదిలిపెట్టాలని ఆయన కోరారు. పాము కాటుకు గురైన వారికి తక్షణం చికిత్స అందించేందుకు గాను జిల్లాలోని అన్ని ఆరోగ్య కేంద్రాలు, ఉప ఆరోగ్య కేంద్రాల్లో యాంటీ వెనమ్ వ్యాక్సిన్‌లను అందుబాటులో వుంచామని ఆర్ఎస్ సింగ్ స్పష్టం చేశారు. పాముకాటుకు గురైన సందర్భాల్లో మూఢనమ్మకాలు, నాటు వైద్యాన్ని నమ్ముకోకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలని ఆయన కోరారు. ఇదే సమయంలో అన్ని పాములు విషపూరితం కాదని.. సకాలంలో చికిత్స అందిస్తే మనిషి ప్రాణాలను కాపాడవచ్చని ఆర్ఎస్ సింగ్ తెలిపారు. 
 

PREV
click me!

Recommended Stories

గంటకు 9 కి.మీ స్పీడ్, 46 కి.మీ ప్రయాణానికి 5 గంటలా..! దేశంలోనే స్లోయెస్ట్ ట్రైన్ ఏదో తెలుసా?
Weather Update : మళ్లీ భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్ !