మూడేళ్ల కొడుకుని సిగరెట్ తో కాల్చి చంపిన తండ్రి

Published : Feb 28, 2019, 12:47 PM IST
మూడేళ్ల కొడుకుని సిగరెట్ తో కాల్చి చంపిన తండ్రి

సారాంశం

మూడేళ్ల కొడుకుని.. కన్న తండ్రే సిగరెట్ తో వారం రోజులపాటు కాల్చి మరీ చంపేశాడు. ఈ దారుణ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో  చోటుచేసుకుంది.  

మూడేళ్ల కొడుకుని.. కన్న తండ్రే సిగరెట్ తో వారం రోజులపాటు కాల్చి మరీ చంపేశాడు. ఈ దారుణ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో  చోటుచేసుకుంది.  అయితే.. కొడుకు అనారోగ్యాన్ని సరిచేసేందుకు తండ్రి ఇలాంటి వైద్యం చేయడం గమనార్హం.

పూర్తి వివరాల్లోకి వెళితే... కోలారు జిల్లా మాలూరు పట్టణంలోని మారుతీకాలనీకి చెందిన హరీష్, రేణుక దంపతులకు పృథ్వి(3) అనే కుమారుడు ఉన్నాడు. హరీష్ ప్రైవేటు బస్సు డ్రైవర్ గా పనిచేస్తూ.. కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే.. గత కొంతకాలంగా.. పృథ్వి ఆరోగ్యం సరిగా ఉండటం లేదు.

దీంతో.. భూతవైద్యుడిని సంప్రదించగా.. వాతలు పెట్టాలని సూచించాడు. వారం రోజులపాటు అతను చెప్పినట్లుగా సిగరెట్ తో వాతలు పెట్టారు. దీంతో.. వాతలు పుండ్లుగా మారి రోగం మరింత ముదిరింది. అప్పుడు ఆస్పత్రికి తీసుకువెళ్లగా.. చికిత్స పొందుతూ కన్నుమూశాడు. బాలుడి తాత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బాలుడి తల్లిదండ్రులను అరెస్టు చేశారు. 

PREV
click me!

Recommended Stories

భార‌త్‌లో ల‌క్ష‌ల కోట్ల పెట్టుబడులు పెడుతోన్న అమెజాన్‌, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌.. భ‌విష్య‌త్తులో ఏం జ‌ర‌గ‌నుందంటే?
Viral News : ఇక జియో ఎయిర్ లైన్స్.. వన్ ఇయర్ ఫ్రీ..?