పూల్వామా దాడి: పాక్‌కు ఆధారాలిచ్చిన భారత్

By narsimha lodeFirst Published Feb 28, 2019, 12:34 PM IST
Highlights

పూల్వామా దాడిలో జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ హస్తం ఉందని ఆధారాలను మరోసారి భారత్ పాక్‌కు అందజేసింది. 
 

న్యూఢిల్లీ: పూల్వామా దాడిలో జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ హస్తం ఉందని ఆధారాలను మరోసారి భారత్ పాక్‌కు అందజేసింది. 

ఈ నెల 14వ తేదీన పూల్వామా వద్ద సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణీస్తున్న వాహనాలపై జేషే మహ్మద్ ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో సుమారు 44 మంది సీఆర్పీఎఫ్  ఉగ్రవాదులు మృత్యువాత పడ్డారు.

ఈ ఘటనకు జేషే మహ్మాద్  హస్తం ఉందని భారత్ ఆరోపించింది. ఈ ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు చూపాలని పాక్ డిమాండ్ చేసింది. ఈ తరుణంలో మరోసారి పాక్‌కు ఇండియా ఆధారాలను అందించింది.

బుధవారం నాడు భారత విదేశాంగ శాఖ పాక్ డిప్యూటీ హై కమిషనర్ సయ్యద్ షాకు సమన్లు జారీ చేశారు.ఈ సమయంలోనే భారత్ పూల్వామా దాడిలో జైషే ఉగ్రవాదుల హస్తం ఉన్న విషయాన్ని ఆధారాలను ఇచ్చారు.

పాక్ ఆర్మీ చేతిలో బందీగా ఉన్న ఎయిర్ వింగ్ కమాండర్ అభినందన్ ను సురక్షితంగా పంపాలని ఇండియా పాక్‌ను కోరింది. మరో వైపు భారత రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ త్రివిధ దళాల అధిపతులతో సమావేశం కానున్నారు. యుద్ధం సంభవిస్తే తీసుకోవాల్సిన చర్యలపై అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు.
 

click me!