యుద్ధ మేఘాలు: త్రివిధ దళాలకు మోడీ స్వేచ్ఛ

By narsimha lodeFirst Published Feb 28, 2019, 11:32 AM IST
Highlights

సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం ఏర్పడడంతో త్రివిధ దళాలకు భారత ప్రధాని నరేంద్ర మోడీ పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు.  బుధవారం నాడు ఉన్నతాధికారులతో వరుస సమావేశాలు నిర్వహించిన మోడీ ఈ మేరకు ఆదేశాలు  జారీ చేశారు.

న్యూఢిల్లీ: సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం ఏర్పడడంతో త్రివిధ దళాలకు భారత ప్రధాని నరేంద్ర మోడీ పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు.  బుధవారం నాడు ఉన్నతాధికారులతో వరుస సమావేశాలు నిర్వహించిన మోడీ ఈ మేరకు ఆదేశాలు  జారీ చేశారు.

బాలకోట్‌లోని జైషే మహ్మద్ ఉగ్ర స్థావరాలపై ఇండియా దాడికి పాల్పడిన తర్వాత చోటు చేసుకొన్న పరిణామాలపై  ఇండియా ఎప్పటికప్పుడు అలర్ట్‌గా ఉంటుంది. పాక్ నుండి వచ్చే ఎలాంటి చర్యలనైనా ఎదుర్కొనేందుకు ఇండియా సంసిద్దంగా ఉంది.

బుధవారం నాడు పాక్ కు చెందిన యుద్ధ విమానాలు రావడంతో ఇండియాకు చెందిన వైమానిక సిబ్బంది తిప్పికొట్టిన విషయం తెలిసిందే.  ఈ ఘటన తర్వాత  మోడీ వరుసగా సమావేశాలు నిర్వహించారు.ఈ సమావేశాల్లో దేశ భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

మరో వైపు త్రివిధ దళాలకు ప్రధాని మోడీ పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. మిగ్‌-21 ఫైటర్‌ జెట్‌ను పాకిస్తాన్‌ నేలకూల్చిన విషయాన్ని, భారత వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్థమాన్‌ అరెస్ట్‌ చేసినట్లు పాక్‌ ప్రకటించడంపై కూడా చర్చించారు. రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌, త్రివిధ దళాధిపతులతో పాటు ఇతర సీనియర్‌ ఉన్నతాధికారులతో సమావేశాల సందర్భంగా ప్రధాని మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారు.

 భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న క్రమంలో సరిహద్దు ప్రాంతాల్లో హైఅలర్ట్‌ కొనసాగుతోంది. మరోవైపు దేశంలోని ప్రధాన నగరాల్లో పోలీసు, పారామిలటరీ బలగాలను మోహరించారు. 

click me!