"ఆ చరిత్రను ఎవ్వరు మార్చలేరు": మొఘల్ పాఠ్యాంశాల తొలగింపుపై ఫరూక్ అబ్దుల్లా  సంచలన వ్యాఖ్యలు

Published : Apr 08, 2023, 07:46 PM IST
"ఆ చరిత్రను ఎవ్వరు మార్చలేరు": మొఘల్ పాఠ్యాంశాల తొలగింపుపై ఫరూక్ అబ్దుల్లా  సంచలన వ్యాఖ్యలు

సారాంశం

800 సంవత్సరాల  మొఘలులు పాలనలో హిందువులు, క్రైస్తవులు లేదా సిక్కులు ఎవరూ బెదిరింపులకు గురికాలేదని ఫరూక్ అబ్దుల్లా అన్నారు. ఎర్రకోట, హుమాయూన్ సమాధిని ఎలా దాచిపెడతావు అన్నాడు. కైయ్యానికి కేంద్ర ప్రభుత్వం కాలు దువ్వుతోందని అన్నారు. 

ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాల నుంచి మొఘల్‌ల అధ్యాయాన్ని తొలగించడాన్ని జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా తీవ్రంగా ఖండించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ చరిత్రను ఎవరూ మార్చలేమని అన్నారు. చరిత్రకు ఆధారంగా ఎర్రకోట, తాజ్ మహల్,ఇతర స్మారక చిహ్నాలు ఉన్నాయనీ, వాటిని చెరిపేయలేమని అన్నారు. పుస్తకాల నుండి చరిత్రను తొలగించిన షాజహాన్, అక్బర్, హుమాయూన్, జహంగీర్‌లను ఎలా మర్చిపోగలరు? అన్ని ప్రశ్నించారు.  

800 సంవత్సరాల పాలనలో (మొఘలులు) హిందువులు, క్రైస్తవులు లేదా సిక్కులు ఎవరూ బెదిరింపులకు గురికాలేదని ఫరూక్ అబ్దుల్లా అన్నారు. ఎర్రకోట, హుమాయూన్ సమాధిని ఎలా దాచిపెడతావు అన్నాడు.కేంద్ర ప్రభుత్వం వివాదాలను తెర తీస్తుందని ఆరోపించారు. 

నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) 12వ తరగతి చరిత్ర పుస్తకాలతో సహా వివిధ తరగతులకు సంబంధించిన పుస్తకాలను సవరించింది .  మొఘల్ సామ్రాజ్యంపై అధ్యాయాలను తొలగించింది. దేశవ్యాప్తంగా NCERT సిలబస్‌ని అనుసరించే అన్ని పాఠశాలలకు మార్పులు వర్తిస్తాయి. దీనికి సంబంధించి వివాదాలు కొనసాగుతున్నాయి.

నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) 11వ తరగతి సోషియాలజీ పాఠ్యపుస్తకం నుండి గుజరాత్ అల్లర్ల ప్రస్తావన తొలగించబడింది. అలాగే.. కొన్ని నెలల క్రితం.. 2002 మత హింసకు సంబంధించిన టెక్స్ట్‌ని 12వ తరగతి పాఠ్యపుస్తకాల నుండి తొలగించారు. ఈ మొత్తం వివాదంపై కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుంది.  చరిత్రను వక్రీకరించడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తుంది. భారతీయ జనతా పార్టీ, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఎన్ని ప్రయత్నాలు చేసినా చరిత్ర మారదని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు.

PREV
click me!

Recommended Stories

మహిళల కోసం వన్ స్టాప్ సెంటర్లు.. వీటివల్ల లాభాలేంటో తెలుసా?
Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?