EMIలో మొబైల్ ఫోన్లు, కార్లు, టీవీలే కాదు.. మామిడి పండ్లు కూడా కొనుగోలు చేయవచ్చు!

By Rajesh KarampooriFirst Published Apr 8, 2023, 6:25 PM IST
Highlights

Mangoes On EMI: సాధారణంగా మొబైల్ ఫోన్లు, టీవీలు సహా గృహోపకరణాలు వాయిదాల పద్దతిలో కొనుగోలు చేసి ఉంటారు. కానీ ఎప్పుడైనా.. మామిడి పండ్లను  ఈఎంఐలో కొనుగోలు చేశారా? ఇది పుణేకు చెందిన ఓ పండ్ల వ్యాపారి వినూత్న ప్రయోగం.

Mangoes On EMI: ఇప్పటి వరకు మీరు ఫ్రిజ్, ఏసీ, టీవీ వంటి అనేక వస్తువులను  EMIలో కొనుగోలు చేసి ఉంటారు. కానీ,  వాయిదాల్లో (ఈఎంఐ పద్దతి) పండ్లను విక్రయించడాన్ని మీరు చూశారా. తాజాగా మామిడి పండ్లు కూడా ఈఎంఐలో అమ్ముతున్నారు. అవును, ఇది నిజం..  మామిడి పండ్లను కొనుగోలు చేసి .. వాయిదా ( ఈఎంఐ) పద్దతిలో చెల్లించవచ్చు. ఇది  పుణేకు చెందిన ఓ పండ్ల వ్యాపారి వినూత్న ఆలోచన.

వేసవికాలంలో లభించే మామిడి పండ్లంటే.. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అమితంగా ఇష్టపడుతుంటారు. వాటిని చూస్తుంటేనే.. నోళ్లు ఊరుతుంటాయి. కానీ, వాటి ధరలే కొండెక్కాయి. దీంతో సామాన్యులు కొనలేని పరిస్థితి. ఈ పరిస్థితితో పుణే వ్యాపారి తన మామిడి పండ్ల అమ్మకాలను పెంచేందుకు ఓ ప్రత్యేకమైన పథకాన్ని రూపొందించాడు. ఆయన వినూత్న ఆలోచన అందరి  ద్రుష్టిని ఆకర్షిస్తుంది.  ఆ కథేంటో?  ఆ విన్నూత ఆలోచనేంటో..? ఇప్పుడూ తెలుసుకుందాం..

మహారాష్ట్రలోని డియోగర్ , రత్నగిరిలో లభించే.. అరుదైన మామిడిపండ్లను  అల్ఫోన్సోను హపస్ మ్యాంగో అని కూడా పిలుస్తారు. అన్ని రకాల మామిడిలో అల్ఫోన్సో  చాలా ప్రత్యేకం, వాటిని చాలా ఉత్తమమైనదిగా పరిగణిస్తారు. కానీ వాటి అద్భుతమైన రుచి, తక్కువ ఉత్పత్తి కారణంగా వాటి ధరలు  సామాన్యులకు అందుబాటులో ఉండవు. ఈ ఏడాది కూడా అల్ఫోన్సో మామిడి పండ్లను డజన్ రూ.800 నుంచి రూ.1,300 వరకు రిటైల్ మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రత్యేకమైన మామిడిపండు రుచిని సామాన్యులకు కూడా అందుబాటులోకి తీసుకురావడానికి గౌరవ్ సనాస్ అనే వ్యాపారవేత్త ఓ ప్రత్యేకమైన ఆఫర్‌తో ముందుకొచ్చాడు. పూణేకు చెందిన ఈ పండ్ల విక్రేత ప్రజలకు EMIలో మామిడి పండ్లను కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పించారు. అంటే, ఖరీదైన ధర కారణంగా కొనడానికి వెనుక ముందు ఆలోచించే వారికి వాయిదాలలో చెల్లించే అవకాశం కల్పించారు. 

పండ్ల విక్రయదారుడు గౌరవ్ సనాస్ మాట్లాడుతూ.. మామిడి సీజన్ ప్రారంభమైన వెంటనే ఆల్ఫోన్సో ధరలు భారీగా పెరిగాయని తెలిపారు. అటువంటి పరిస్థితిలో, అల్ఫోన్సో లను EMIపై ఇస్తే, ప్రతి ఒక్కరూ దానిని రుచి చూడవచ్చు. ఈ ఆలోచనతో ఈ ఆఫర్‌ను ప్రారంభించనని తెలిపారు. ఈ మామిడి పండ్లను కొనుగోలు చేయడానికి ప్రజలకు నిధులు ఇవ్వాలని ఫైనాన్స్ కంపెనీలను కోరుతున్నట్లు ఆయన చెప్పారు. రానున్న రోజుల్లో కూడా అదే జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

దేశంలోనే ఈఎంఐపై మామిడి పండ్లను కొనుగోలు చేసేందుకు ఆఫర్ చేస్తున్న మొదటి విక్రేత తానేనని చెప్పారు. అల్ఫోన్సో వంటి మామిడి పండ్ల పెట్టె ధర దాదాపు 6000 నుంచి 7000 రూపాయలకు చేరుకుంటుందని తెలిపారు. అటువంటి పరిస్థితిలో  ప్రజలు వారి మనస్సు ప్రకారం మామిడిని కొనుగోలు చేయరు. మరోవైపు..నెలకు 700 లేదా 800 రూపాయలు చెల్లించే అవకాశం కల్పించమన్నారు. ఈ ఆలోచనతో ఈఎంఐ చెల్లించి మామిడి పండ్లను కొనుగోలు చేయాలని చాలా మందికి కాల్స్ వస్తున్నాయని తెలిపారు. అయితే సన్‌షాప్‌లో వాయిదాల పద్ధతిలో అల్ఫోన్సో మామిడి పండ్లను కొనుగోలు చేయాలంటే కనీసం రూ.5000 కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ఇప్పటి వరకు చాలా మంది ముందుకు వచ్చారని తెలిపారు. ఆ విధంగా EMIలో అల్ఫోన్సోను విక్రయించే ప్రయాణం ప్రారంభమైంది. 

click me!