అన్నదాత ఆక్రందన.. 160 కిలోల వెల్లుల్లిని తగులబెట్టిన రైతు.. ‘ధర రావట్లేదు’

Published : Dec 19, 2021, 03:00 PM IST
అన్నదాత ఆక్రందన.. 160 కిలోల వెల్లుల్లిని తగులబెట్టిన రైతు.. ‘ధర రావట్లేదు’

సారాంశం

ఓ అన్నదాత తన పంటకు న్యాయమైన ధర రాలేదని కలత చెంది.. తన పంటకు నిప్పు పెట్టాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. మహారాష్ట్రలోని మందసోర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. వ్యవసాయ మార్కెట్‌లోనే ఆయన తన పంటను తగులబెట్టాడు. మంటలు మండుతుంటే.. భారత్ మాతాకీ జై.. జై జవాన్ జై కిసాన్ నినాదాలు చేశారు. 

భోపాల్: రాత్రింబవళ్లు కష్టపడి పంట పండించిన రైతులు(Farmers) చివరకు ధరను పొందలేక నష్టపోతున్నారు. వేలాది రూపాయలు  పెట్టుబడి పెట్టి పండించిన పంట(Crop)ను మార్కెట్‌కు తీసుకెళ్లడానికి అయ్యే వాహనం చార్జీలు కూడా మార్కెట్‌లో రావట్లేదని అన్నదాతలు `ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి ఘటనే మధ్యప్రదేశ‌లోని మందసోర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. పెట్టుబడి పెట్టిన డబ్బులు కూడా రావడం లేదని.. ఆవేదనతో ఆ రైతు 160 కిలోల వెల్లుల్లిని మార్కెట్‌లోనే తగులబెట్టాడు. పంట మంటల్లో కాలిపోతుంటే.. భారత్ మాతాకీ జై, జై జవాన్.. జై కిసాన్ అంటూ నినాదాలు ఇచ్చాడు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.

డియోలీకి చెందిన శంకర్ సిర్ఫిరా తన పంటకు మందసోర్‌లోని వ్యవసాయ మార్కెట్‌లో నిప్పు పెట్టాడు. తాను ఎంతో కష్టపడుతున్నారని, పంట కోసమూ మంచి పెట్టుబడి పెడుతున్నారని వివరించారు. కానీ, అందులో సగమైనా తనకు తిరిగి రావడం లేదని బాధపడ్డారు. ఈ సీజన్‌లో వెల్లుల్లిని పండించడానికి రూ. 2.5 లక్షల డబ్బులను వెచ్చించినట్టు వివరించారు. కానీ, మార్కెట్‌లో తనకు రూ. 1 లక్ష మాత్రమే వచ్చాయని చెప్పారు. ఈ మార్కెట్‌కు తన పంటను తరలించడానికి రవాణా చార్జీలుగా రూ. 5వేలు ఖర్చు చేశానని ఆయన తెలిపారు. కానీ, తన పంటకు ఇక్కడ రూ. 1,100 మాత్రమే వస్తున్నాయని చెప్పారు. బయ్యర్ల నుంచి న్యాయమైన ధర(Fari Price) రాకుంటే.. ఆ పంటను తగులబెట్టడమే మంచిది అని పేర్కొన్నారు.

Also Read: పంజాబ్‌లో రైతుల పార్టీ.. ప్రకటించిన రైతు నేత గుర్నామ్.. అన్ని సీట్లలో పోటీ

ఆయన తన వెల్లుల్లి పంటకు నిప్పు పెట్టగానే చుట్టు పక్కల ఉన్న రైతులు అక్కడకు వచ్చి జై జవాన్.. జై కిసాన్ అంటూ నినాదాలు చేశారు. అలాగే, ఆ మంట ఇతరుల పంటకు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు వెంటనే స్పాట్‌కు చేరారు. రైతు శంకర్ సిర్ఫిరాను పోలీసుల స్టేషన్‌కు తీసుకు వెళ్లారు. ఆయనను ప్రశ్నించడానికి తీసుకెళ్లారు. ఆ రైతు తన పంటకు నిప్పు పెట్టాడని, కానీ, ఆ మంటలు ఇతరుల పంటకు వ్యాపించి నష్టపరచలేదని పోలీసులు తెలిపారు. ఆయనపై ఇతరుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాలేవని, కాబట్టి, ఎలాంటి కేసూ నమోదు కాలేదని చెప్పారు.

రైతులు ఇలా తమ ఆగ్రహావేశాలను బహిరంగంగా వ్యక్త పరచడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ పలుసార్లు ఇలాంటి ఆవేశాలు వ్యక్తమయ్యాయి. ఆగస్టు నెలలో నాసిక్‌లో ఓ రైతు తాను పండించిన టమాటాలకు హోల్ సేల్‌లో ధర రావడం లేదని బాధపడ్డారు. అందుకే ఓ రోడ్డుపైనే కారులో నుంచి టమాటాలను రోడ్డుపై పారబోశాడు. ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహాలో 2018లోనూ ఇలాంటి ఘటనే జరిగింది. సుమారు వంద మంది రైతులు తాము పండించిన టమాటాలను రోడ్డుపై పోశారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్