ఎన్నిక‌లొచ్చాయిగా.. వారి రాక కోసం వేచి ఉన్నాం : Akhilesh Yadav

Published : Dec 19, 2021, 02:59 PM IST
ఎన్నిక‌లొచ్చాయిగా.. వారి రాక కోసం వేచి ఉన్నాం : Akhilesh Yadav

సారాంశం

ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతోన్న కొద్దీ బీజేపీ నేత‌ల్లో భ‌యం క‌నిపిస్తోందని, అందుకే కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌ల‌తో దాడుల‌కు తెగ‌బ‌డుతోన్నార‌ని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) ఆరోపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి .. త‌మ నేత‌ల ఫోన్‌లను ట్యాప్ చేస్తున్నారని అన్నారు.  

ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికలు స‌మీపిస్తుండ‌టంతో త‌న పార్టీ నేత‌ల‌పై బీజేపీ దాడుల‌కు దిగుతోంద‌ని, త‌మ నేత‌ల ఫోన్‌లను ట్యాప్ చేస్తున్నారని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) ఆరోపించారు. ఎన్నిక‌ల స‌మీపిస్తున్న త‌రుణంలో బీజేపీ త‌మ రాజకీయ ప్ర‌త్యర్థులపై కేంద్ర దర్యాప్తు సంస్థలు, ఆదాయ పన్ను శాఖ (ఐటీ)ను ఉసిగొల్పుతుందని అఖిలేశ్‌ యాదవ్‌ మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లో శనివారం అఖిలేశ్ కు సన్నిహితులైన ముగ్గురిపై ఐటీ దాడులు జరిగాయి. దీనిపై ఎస్పీ చీఫ్‌ స్పందించారు. 

Read Also : Omicron: యూకేలో కేసుల పెరుగుదల పెద్ద వేవ్‌‌కు సంకేతం..! లండన్‌లో పరిస్థితులు విషమం

తాను ముందు నుంచీ చెబుతున్నాన‌నీ, ఎన్నికలు సమీపిస్తోన్న కొద్దీ..  బీజేపీ త‌న ప్రత్య‌ర్దుల‌పై కేంద్ర ఏజెన్సీల‌తో దాడులు ప్రారంభిస్తోంద‌ని గ‌తంలో చెప్పిన‌ట్టు గుర్తు చేశారు. ఇప్పుడు ఐటీని రంగంలోకి దించింది. తర్వాత సీబీఐ, ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌)లు కేంద్ర సంస్థ‌ల‌ను ఒక్కొటి రంగంలోకి దించుతుందని అన్నారు. వారి రాక కోసం తాము కూడ చూస్తున్నామ‌నీ,  వారు ఏం చేసిన త‌మ  సైకిల్ ఆగ‌ద‌ని అన్నారు. అంత‌కు మించిన వేగంతో దూసుకెళ్తోందని అన్నారు. రథయాత్ర, పార్టీ తీసుకున్న ఇతర కార్యక్రమాలు యథాప్రకారం కొనసాగుతాయి.

Read Also : క్ష‌త‌గాత్రుల‌ను హాస్పిట‌ల్స్‌లో చేరిస్తే రూ. 5 వేలు ప్రైజ్‌.. ఎక్కడో తెలుసా ?v

యూపీలో బీజేపీకి భంగపాటు తప్పదు. ఇలాంటి వాటితో రాష్ట్ర ప్రజలను మాయ చేయలేరని బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇటీవ‌ల యూపీ స‌మాజ్ వాదీ పార్టీ నేత‌ల‌పై ఐటీ దాడులు జ‌రుగుతున్నాయి. ఇటీవ‌ల అభిలేష్ యాద‌వ్ స‌న్నిహితులైన ఎస్పీ జాతీయ కార్యదర్శి రాజీవ్‌ రాయ్‌, అఖిలేశ్‌ వ్యక్తిగత కార్యదర్శి జ్ఞానేంద్ర యాదవ్, ఎస్పీ మెయిన్‌పూరి కార్య‌ద‌ర్శి,  అఖిలేశ్‌కు సన్నిహితుడైన మనోజ్‌ యాదవ్‌లపై కూడా శనివారం ఐటీ దాడులు జరిగాయి.  

Read Also : Typhoon Rai: ఫిలిప్పీన్స్‌లో రాయ్ తుపాన్ బీభత్సం.. 75 మంది మృతి..

ఈ దాడుల‌ను చూస్తేంటే.. బీజేపీకి ఓటమి భయం పెరుగుతోంద‌ని, కాషాయదళంపై ధ్వజమెత్తారు. అలాగే.. ఇటీవ‌ల లఖీంపూర్‌ ఖేరిలో  రైతులపై జ‌రిగిన దాడిని జలియన్‌వాలా భాగ్‌ ఊచకోతతో పోల్చారు అఖిలేశ్‌. జలియన్‌వాలా భాగ్‌లో బ్రిటిషర్లు ప్రజలను ముందు నుంచి కాల్చారు. కానీ, లఖీంపూర్‌లో బీజేపీ నేతలు వెనక నుంచి రైతులపై నుంచి జీపును తోలారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్