Singhu border: రైతులు నిరసన తెలుపుతున్న సింఘు సరిహద్దుకు సమీపంలో దారుణం.. ఉరికి వేలాడుతూ కనిపించిన రైతన్న

By team teluguFirst Published Nov 10, 2021, 4:14 PM IST
Highlights

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ సంస్కరణ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఢిల్లీ శివారులోని సింఘు సరిహద్దు (Singhu border) వద్ద దారుణం చోటుచేసుకుంది. అక్కడికి సమీపంలో ఓ రైతు చెట్టుకు ఉరికి వేలాడుతూ కనిపించాడు.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ సంస్కరణ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఢిల్లీ శివారులోని సింఘు సరిహద్దు (Singhu border) వద్ద దారుణం చోటుచేసుకుంది. అక్కడికి సమీపంలో ఓ రైతు చెట్టుకు ఉరికి వేలాడుతూ కనిపించాడు. ఆ రైతును పంజాబ్‌కు చెందిన 45 ఏళ్ల గురుప్రీత్ సింగ్‌గా గుర్తించారు. అతనిది ఫతేఘర్ సాహిబ్ (Fatehgarh Sahib) జిల్లాకు చెందిన వ్యక్తి అని తెలిపారు. మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు.. పోస్టుమార్ట‌మ్ నిమిత్తం సోనిపల్‌లోని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న కుండ్లీ పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. 

గురుప్రీత్ సింగ్ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సాగుతున్న నిరసల్లో పాల్గొన్నాడు. ఆయనకు భారతీయ కిసాన్ యూనియన్‌కు చెందిన క్రాంతికారి విభాగంతో అనుబంధం ఉందని అక్కడివారు తెలిపారు.  అయితే అతడు ఎందుకు ఆత్మహత్య చేసుకన్నాడనే దానిపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. 

Also read: రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం: బస్సు, ట్యాంకర్ ఢీ 12 మంది సజీవ దహనం

కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు గతేడాది నవంబర్‌ నుంచి నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఢిల్లీకి సరిహద్దు ప్రాంతాలైన సింఘు, టిక్రీలలో రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం వారితో 11 రౌండ్ల చర్చలు జరిపింది. అయితే ఆ తర్వాత రైతులు చేపట్టిన ర్యాలీ హింసాత్మకంగా మారింది. ఆ తర్వాత చర్చలు జరగలేదు. కొత్త చట్టాలు రైతులకు అనుకూలంగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం చెబుతుండగా.. రైతులు మాత్రం వాటిని వ్యతిరేకిస్తున్నారు. పంటలకు కనీస మద్దతు ధర (MSP)కి హామీ ఇచ్చేలా కొత్త చట్టాన్ని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. తమ నిరసకు ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో అన్నదాతులు మరోసారి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడానికి సిద్దమవుతున్నట్టుగా తెలుస్తోంది. 

గత నెలలో కూలీ దారుణ హత్య..
గత నెలలో సింఘు సరిహద్దుల్లో ఓ కూలీ దారుణ హత్యకు గురికావడం తీవ్ర కలకలం రేపింది. రైతులు ధర్నా చేస్తున్న చోట బారికేడ్లకు అతని మృతదేహాన్ని కట్టేశారు. అతని లఖ్బీర్ సింగ్ అనే 35 ఏళ్ల దళిత రైతుగా గుర్తించారు. మృతుడికి ఎటువంటి నేర చరిత్ర లేదని పోలీసులు వెల్లడించారు. అతనికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నట్టుగా చెప్పారు. అయితే ఈ ఘటన వెనక నిహంగ్ సిక్కుల హస్తం ఉన్నట్టుగా తేలింది. గురు గ్రంథ్ సాహిబ్‌ను అపవిత్రం చేశారని నిందితులు తెలిపారు. అతడిని చిత్ర హింసలు పెట్టి దారుణంగా హత్య చేసినట్టుగా తేలింది. 

click me!