సహజీవనం.. స్వలింగ సంపర్కుల రూపంలోనూ కుటుంబ సంబంధాలు : సుప్రీంకోర్టు

By Bukka SumabalaFirst Published Aug 29, 2022, 12:12 PM IST
Highlights

సహజీవనం చేస్తున్నవారు, స్వలింగ సంపర్కం లాంటి సంబంధాల్లో కూడా కుటుంబ సంబంధాలు ఉంటాయని, వాటికి చట్టపరమైన రక్షణ అవసరమని సుప్రీంకోర్టు తెలిపింది. 

ఢిల్లీ : కుటుంబం అంటే తండ్రి, తల్లి పిల్లలనే సంప్రదాయ భావన ఉందని, దీనికి భిన్నమైన రూపాల్లోనూ కుటుంబ సంబంధాలు ఉండొచ్చని, వాటికి చట్టపరమైన రక్షణ అవసరమనే అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు వ్యక్తం చేసింది. అవివాహిత భాగస్వామ్యాలు, స్వలింగ సంపర్కం లాంటి సంబంధాలు ఈ భిన్నమైన రూపాల కిందికి వస్తాయని న్యాయమూర్తులు జస్టిస్ Dy chandrachud, జస్టిస్ ఎఎస్ బోపన్న ధర్మాసనం పేర్కొంది. గత వివాహబంధంలో భర్తకు పుట్టిన ఇద్దరు పిల్లల్లో ఒకరి సంరక్షణకు మహిళా ప్రసూతి సెలవు తీసుకున్నందున, ఇప్పుడు తాను జన్మనిస్తున్న బిడ్డకు చట్టపరంగా సెలవు నిరాకరించడం సరికాదని ఓ కేసులో సుప్రీం కోర్టు తీర్పు ఇస్తూ ఈ విధంగా వ్యాఖ్యలు చేసింది.

స్వలింగ వివాహాలపై తన వైఖరిని పునరుద్ఘాటించిన కేంద్రం.. సుప్రీం కోర్టు తీర్పును తప్పుగా అన్వయం చేస్తున్నారు..

ఇదిలా ఉండగా, ఇలాంటి సహజీవనం కేసులో జూలై 16న సుప్రీంకోర్టు ఏమందంటే.. తమంతట తాముగా కలిసి, ఇష్టపడి ఇద్దరూ సహజీవనం చేసి.. ఆ తర్వాత అది బెడిసికొట్టడంతో, మనస్పర్ధలు, విభేదాల కారణంగా అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదులు చేయడం సరికాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఇలాంటి ఓ కేసులో నిందితుడుకి ముందస్తు బెయిలు మంజూరు చేసింది. ఈ సమయంలో ద్విసభ్య కమిటీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో ఫిర్యాదు చేసిన వ్యక్తి తనంతట తానే ఇష్టపూర్వకంగా అవతలి వ్యక్తి తో సహజీవనం చేసింది. అంతేకాదు 21 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఆమె అతనితో సంబంధంలోకి అడుగుపెట్టింది. 

నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు లైంగికంగా లోబరుచుకున్నాడు అని, దాడికి పాల్పడ్డాడని చెబుతోంది. ఇష్టపూర్వకంగానే ఆమె అతనితో సంబంధం కొనసాగించినట్లు ఒప్పుకుంది. కాబట్టి అత్యాచారం కింద ipc 376 (2)(ఎన్) ప్రకారం అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ఇది కారణం కాదు అని జస్టిస్ హేమంత్ గుప్త, జస్టిస్ విక్రమ్ నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. దేశంలో ఇలాంటి కేసులు చాలానే న్యాయస్థానాల ముందుకు వస్తున్నాయి. పూర్తి ఇష్టంతోనే పరస్పర అంగీకారంతోనే వాళ్ళు కలిసి ఉంటున్నారు. వివాహంతో సంబంధం లేకుండా పిల్లల్ని కూడా కంటున్నారు. 

తీరా గొడవలు జరిగితే చాలు.. ఇలా అత్యాచారం, లైంగిక దాడులంటూ.. న్యాయం కోసం కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. ఇది తీవ్రంగా పరిగణించాల్సిన విషయం. సరైన పద్ధతి కాదు.. అంటూ బెంచ్ వ్యాఖ్యానించింది. ఈ మేరకు రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను తోసిపుచ్చుతూ నిందితుడికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే బెయిల్ మంజూరు అయినప్పటికీ దర్యాప్తు మాత్రం యథాతథంగా కొనసాగాలని సుప్రీం బెంచి రాజస్థాన్ పోలీసులకు సూచించింది. 
 

click me!