AC coach: ఛీ ఛీ.. రైల్వే ఏసీ కోచ్‌లో బెడ్‌షీట్లు దొంగిలించిన కుటుంబం, దొరికిపోయారిలా

Published : Sep 22, 2025, 05:41 PM IST
AC Coach

సారాంశం

ఓ కుటుంబం తమ దొంగబుద్ధి చూపించింది.  రైలు ఫస్ట్ ఏసీ కోచ్‌లో (AC coach) ప్రయాణించి ఆ తరువాత అక్కడున్న బెడ్‌షీట్లు, టవల్స్ దొంగిలించేందుకు ప్రయత్నించింది. కానీ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోవడంతో వారి వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

రైలు, రైళ్లలో వాడే వస్తువులు అన్నీ ప్రభుత్వ ఆస్తి. ప్రభుత్వ ఆస్తిని దోచుకోవడం సులువనుకుంటారు. అలా అనుకునే రైలులోని ఏసీ కోచ్ లో (AC Coach) బెడ్ షీట్లు కొట్టేస్తూ ఓ కుటుంబం దొరికిపోయింది. అది కూడ వాళ్లు ఏసీ కోచ్లో ప్రయాణించారు. వారు  కప్పుకోవడానికి ఇచ్చే బెడ్‌షీట్లు, టవల్స్‌ను దొంగిలించేందుకు ప్రయత్నించి ఆ సమయంలో పట్టుబడ్డారు. ఢిల్లీ-ఒడిశా పురుషోత్తం ఎక్స్‌ప్రెస్ రైలు ఫస్ట్ ఏసీ కోచ్‌లో ఈ ఘటన జరిగింది. ఈ ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో, వారిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అసలేం జరిగింది?

ఏసీ కోచ్‌లో ప్రయాణిస్తున్న ఓ కుటుంబంలోని మహిళ, ప్రయాణికులకు రైలులో ఇచ్చే బెడ్‌షీట్‌ను తీసి బ్యాగులో పెట్టి దొంగిలించే ప్రయత్నం చేసింది. కానీ రైల్వే సిబ్బంది ఆ విషయాన్ని పసిగట్టేశారు. రైలు దిగేలోపే వారిని పట్టుకున్నారు.  ఈ ఘటనను బోగీ అటెండెంట్ రికార్డ్ చేసినట్టు కనిపిస్తోంది, వీడియో వైరల్ అయింది. సోషల్ మీడియా ఎక్స్‌లో @bapisahoo అనే వ్యక్తి ఈ వీడియోను పోస్ట్ చేశారు, వీడియోలో ప్రయాణికుల కుటుంబం, రైల్వే సిబ్బంది మధ్య వాగ్వాదం జరిగింది. ఈ ఘటన ఢిల్లీలోని పురుషోత్తం ఎక్స్‌ప్రెస్ ఫస్ట్ ఏసీలో జరిగింది. 

ఆ వీడియో పోస్టు చేసిన వ్యక్తి  ‘ఈ రైలులో ప్రయాణించడం గర్వకారణం. కానీ ప్రయాణ సమయంలో అదనపు సౌకర్యం కోసం అందించిన బెడ్‌షీట్లను దొంగిలించి ఇంటికి తీసుకెళ్లడానికి వెనుకాడని వారు ఈ బోగీలో కూడా ఉన్నారు’ అతను వీడియో పోస్ట్ చేసి రాశాడు. వీడియోలో అటెండెంట్ వేలు చూపిస్తూ మాట్లాడడం కనిపిస్తూ ఉంటుంది. 

ఈ సమయంలో ప్రయాణికుడు అది పొరపాటున తెలియకుండా జరిగిందని సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు.  మా అమ్మకు తెలియక ఆ వస్తువులను ప్యాక్ చేసి సంచిలో పెట్టారని అతను వివరించే ప్రయత్నం చేశాడు. కానీ దీనితో సంతృప్తి చెందని రైల్వే సిబ్బంది "ఏసీ ఫస్ట్ కోచ్‌లో ప్రయాణిస్తూ ఎందుకు దొంగతనం చేశారు? మీరు తీర్థయాత్రకు వెళ్తున్నామని చెప్పారు కదా" అని రైల్వే సిబ్బంది ఆ కుటుంబాన్ని నిలదీశారు.

అంతేకాదు, రైల్వే నిబంధనల ప్రకారం ఇది నేరం.  కేసు కూడా వారిపై నమోదవుతుంది. వారి బ్యాగులో ఉన్న రైల్వే బెడ్ షీట్లను వారు గుర్తించి బయటికి తీశారు. లేదా డబ్బులు చెల్లించమని కోరారు. ఈ మొత్తం ఘటనను వారు రికార్డు చేసి ఎక్స్ లో పోస్టు చేశారు.  ఫస్ట్ ఏసీలో ప్రయాణించే వ్యక్తులు కచ్చితంగా డబ్బున్నవారై ఉంటారు. కానీ ఇలా బెడ్ షీట్లు దొంగతనం చేయడం మాత్రం వారి లేకితనాన్ని చూపించింది. వీరిక జరిమానా విధించే అవకాశం ఉంది. వీరికి ఎలాంటి శిక్ష పడిందో మాత్రం ఇంకా తెలియరాలేదు.

 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Sabarimala Karthika Deepam: స్వామియే శరణం.. శబరిమల కార్తీక దీపం చూశారా? | Asianet News Telugu
Putin RaGhat Visit:రాజ్ ఘాట్ సందర్శించనున్న పుతిన్.. ఢిల్లీలో భారీగా భద్రత | Asianet News Telugu