Air India: ఎయిర్ ఇండియా విమానంలో అల‌జ‌డి.. పైలెట్ డోర్ ఓపెన్ చేయ‌బోయిన ప్ర‌యాణికుడు

Published : Sep 22, 2025, 12:48 PM IST
Air India

సారాంశం

Air India: ఎయిర్ ఇండియా విమానంలో ఊహించ‌ని సంఘ‌ట‌న జ‌ర‌గింది. బెంగ‌ళూరు నుంచి వార‌ణాసికి వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో ఓ ప్ర‌యాణికుడు చేసిన ప‌ని అంద‌రినీ షాక్‌కి గురి చేసింది. వివ‌రాల్లోకి వెళితే.. 

ఎయిర్ ఇండియా విమానంలో జ‌రిగిన ఓ సంఘ‌ట‌న అంద‌రినీ షాక్‌కి గురి చేసింది. సోమవారం బెంగళూరు నుంచి వారణాసి కి వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం (ఫ్లైట్ IX-1086)లో సెక్యూరిటీ భయం నెలకొంది. ఒక పాసింజర్ కాక్‌పిట్ డోర్ తెరవడానికి ప్రయత్నించాడు.

మరో 8 మంది

అదే సమయంలో ఆ పాసింజర్ సరైన పాస్‌కోడ్ కూడా ఎంటర్ చేశాడు. అయినప్పటికీ, పైలెట్ భద్రత కారణంగా డోర్ తెరవడానికి అంగీక‌రించ‌లేదు. హైజాక్ జ‌రిగే అవకాశ‌ముంద‌న్న అనుమానంతో పైల‌ట్ అల‌ర్ట్ అయ్యాడు. ఆ పాసింజర్ మ‌రో 8 మంది స‌హ‌చ‌రుల‌తో ప్ర‌యాణిస్తున్న‌ట్లు స‌మాచారం.

 కాగా విమానం ల్యాండ్ అయిన వెంట‌నే ఆ 9 మంది ప్ర‌యాణికుల‌కు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF)కి అప్ప‌గించిన‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం అధికారులు వారిని విచారిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటివరకు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఈ ఘటనపై అధికారిక ప్రకటన ఇవ్వ‌క‌పోవ‌డం గ‌మనార్హం.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Sabarimala Karthika Deepam: స్వామియే శరణం.. శబరిమల కార్తీక దీపం చూశారా? | Asianet News Telugu
Putin RaGhat Visit:రాజ్ ఘాట్ సందర్శించనున్న పుతిన్.. ఢిల్లీలో భారీగా భద్రత | Asianet News Telugu