యూట్యూబ్‌లో నకిలీ ముల్లాల బోధనలు ప్రమాదకరం.. ఊహా ప్రపంచంతో వాస్తవ సమస్యలు పరిష్కృతమవుతాయా?

By Asianet NewsFirst Published May 22, 2023, 4:27 PM IST
Highlights

నకిలీ వైద్యులతో ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో.. నకిలీ బోధకులతో(నకిలీ ముల్లా) ముస్లింలకు అంతని హాని ఉంటుంది. నేడు యూట్యూబ్‌లో ఈ నకిలీ ముల్లాలకు గిరాకీ ఎక్కువ. వీరు బలహీనమైన, విద్యావంతులు కాని ముస్లింలను ఆకర్షించి ప్రధాన స్రవంతి రాజకీయాలకు దూరం చేస్తున్నారు. ఖలీఫా రాజ్యంతో అన్ని సమస్యలు తొలగిపోతాయనే భ్రమలు కల్పిస్తున్నారు. 
 

న్యూఢిల్లీ: నకిలీ వైద్యుడితో ప్రాణాలకు ఎంత ప్రమాదమో.. నకిలీ ముల్లా (మతబోధనలు చేసే వ్యక్తి)లతో ఇస్లాంకు అంతే ప్రమాదం. దురదృష్టవశాత్తు ఈ ఇద్దరికీ నేడు ఎక్కువ డిమాండ్ ఉన్నది. లోతైన అవగాహన పెంపొందించుకునే సమయం లేని నేటి ప్రపంచం యూట్యూబ్ వీడియోలో అర్థసత్యాలతో వండి వార్చిన వీడియోలకు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. కొన్ని ఫార్మాసీల మోసాలతో భ్రమల్లోకి వెళ్లి ఆధునిక వైద్యానికి దూరమై ప్రత్యామ్నాయ చికిత్స మళ్లుతున్నారు. అలాగే ఇదీనూ.

యూట్యూబ్ ఓపెన్ చేయగానే.. వెంట్రుకలు పెరగడం దగ్గరి నుంచి ఆల్జీమర్ల వరకు సులువైన ప్రిస్క్రిప్షన్ సూచించే వీడియోల నోటిఫికేషన్లు మీ కంప్యూటర్ లేదా ఫోన్ స్క్రీన్‌లపై రావడం గమనించే ఉంటారు. అదే విధంగా ఆన్‌లైన్‌లో మత బోధకుల వీడియోలు.. ముఖ్యంగా బలహీనులైన వారిని సులువుగా ఆకర్షించే వీడియోల నోటిఫికేషన్లు కనిపిస్తాయి. పుట్టగొడుగుల్లా పెరుగుతూ వస్తున్న నకిలీ బోధకులు ఆన్‌లైన్ ఇండస్ట్రీని స్వారీ చేస్తున్నారు. శాంతియుత ఇస్లాంను నమ్మే ఇస్లామిక్ స్కాలర్లకు వారి ఉనికి అవమానానికి తక్కువేమీ కాదు.

ఆ ర్యాడికల్ బోధకులు అమాయకులను వారి రెచ్చగొట్టే ఐడియాలతో ట్రాప్ చేస్తారు. విద్యావంతులైన ముస్లింలు మాత్రమే వారి ఆలోచనల్లోని డొల్లతనాన్ని పసిగట్టగలరు. కానీ, అమాయకులకు ఇది సాధ్యపడదు. ఇలాంటి నకిలీ బోధకులు మతానికి మచ్చ తెస్తున్నారు. నిజమైన ఇస్లాం నుంచి ప్రజలను భయపెడి దూరం జరిగేలా చేస్తున్నారు.

వెంటనే కాలిఫేట్ (ఖలీఫా రాజ్యం)ను పున:స్థాపించాలని ఆ నకిలీ బోధకులు అరుస్తుండటాన్ని ఈ వీడియోల్లో మనం చూడవచ్చు. లేదంటే ఇతర ముస్లింలు కాఫిర్‌లు అని పలకడం వినవచ్చు. అలాంటి ముల్లాలు కేవలం ఊహాత్మక ప్రపంచ ఆలోచనలను రుద్దుతుంటారు. ఇతర ముస్లిం శాఖలను తిరస్కరిస్తారు. అసలు ఒక చర్చ, ఒక సంవాదానికి వారు అవకాశమే ఇవ్వరు. ఖురాన్‌లోని వ్యాఖ్యలను వారికి అనుకూలంగా తప్పుగా ఉపయోగించుకుంటారు. అలాంటి వారిలో వాహాబీ మస్లక్‌లు ప్రధానస్రవంతి సున్నీ ఆలోచనల నుంచి దూరంగా ఉంటారు. వారికి సరైన అవగాహన లేకున్నా అథారిటేరియనిజంపై గాఢ విశ్వాసాన్ని పెంచుకోవడం విషాదకరం.

Also Read: అయోధ్యలో హిందు ప్రాబల్య వార్డులో స్వతంత్ర ముస్లిం అభ్యర్థి గెలుపు.. స్థానికులు ఏమంటున్నారంటే?

వారు బోధించే ఇస్లాం కేవలం కొన్ని అభూత కథలే, కానీ, నిజమైన మత ఆలోచనలు కావు. వీరు వాస్తవ ప్రపంచం నుంచి వేరుపడి ఉన్నారు. అలా కాదంటే.. ముస్లిం అస్తిత్వమే ఒత్తిడి, తీవ్ర సవాళ్లు ఎదుర్కొనే సమయంలో వారు అలా నడుచుకుని ఉండేవారు కాదు.

ఈ ఉన్మాదులు విదేశాల నుంచి ఆపరేట్ చేయబడుతుంటారు. రాజకీయాలను తప్పుగా అర్థం చేసుకునేలా వీరు ఉపకరిస్తారు. అవాస్తవ ఆలోచనలను వారిలో పురికొల్పుతారు. చివరకు ర్యాడికల్ రిలీజియస్ ఐడియాలకు వారిని ఉన్ముఖులను చేస్తారు. ఇప్పటికే యువతీ, యువకులు ఐఎస్ఐఎస్‌లో చేరుతున్న సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాం. జిహాద్ కోసం మాతృభూమి వదిలి పరాయి గడ్డపైకి వెళ్లాలని నమ్మిస్తున్నారు. తద్వార వారి ఊహాత్మక ప్రపంచాన్ని స్థాపించాలని నమ్మబలుకుతున్నారు. అలాంటి బోధకులు వైవిధ్య భారత దేశంలో ముస్లింలకు చేటు చేస్తున్నారు.

ఈ నకిలీ బోధకులు చెప్పే రాజకీయాలను అంగీకరించినవారిని శత్రువులుగానే చూస్తారు. అలాంటి నకిలీ ముల్లాలు ఈ ప్రపంచంలోని సమస్యలన్నింటికీ ఖలీఫా రాజ్యాన్ని పునరుద్ధరించడమే పరిష్కారం అని వింత వాదనలు చేస్తుంటారు. వారు చరిత్రను కనీసం సరిగ్గా చదవడంలో విఫలమయ్యారని అర్థమవుతుంది. అలాంటి ఊహలతో పేదరికాన్ని తొలగించలేమన్న సత్యం వారి బుర్రలోకి ఎక్కదు. ఇలాంటి వారి మాటలు విశ్వసించేవ వారు ప్రధానస్రవంతి రాజకీయాలకు మెల్లగా దూరమవుతుంటారు. ప్రధాన స్రవంతి రాజకీయ నేతలు, రాజకీయాలు ముస్లింల సమస్యలను తొలగించలేవని వారు చెబుతుంటారు. ఈ ముల్లాలు.. సిద్ధాంతాలు, ఊహల్లో కాకుండా వాస్తవ సమస్యలను ఆలోచించరు. 

విషాదమేమిటంటే.. అలాంటి ముల్లాలు లౌకిక దేశాల్లోనే మనుగడలో ఉంటారు. అదే ముస్లిం ప్రాబల్య సౌదీ అరేబియాలో ఇలాంటి వారిని ఊహించుకోలేం. ఆ దేశంలో ఉంటే వెంటనే వారిని జైల్లో పెట్టేస్తారు. పశ్చిమ ఆసియా దేశా ల్లోనూ ఇలాంటి వారు ముస్లిం లకు ప్రమాద కారులనే అవగాహన వచ్చింది.

 

--- రచయిత అతిర్ ఖాన్

click me!